ఎండాకాలంలో మామిడి పండుతో పాటు ఎక్కువగా దొరికేది పుచ్చకాయ ఒకటి. ఎండాకాలంలో మన అందరికి ఎక్కువగా దాహం వేస్తుంటుంది. అలాంటపుడు కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్ తాగినా దాహం తీరదు. కానీ పుచ్చకాయను తింటే తొందరగా దాహం తీరుతుంది. పుచ్చకాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. మన శరీరం డీహైడ్రేషన్ అవకుండా కాపాడుతుంది. పుచ్చకాయ మన చర్మం కాంతివంతంగా మారడానికి ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో విటమిన్ A, C, E మరియు కాల్షియమ్ లాంటి పోషక విలువలు ఉన్నాయి. […]