ఈ ఏడాది సగం గడిచిపోయింది. కరోనా తాలూకు చేదు జ్ఞాపకాలన్నీ కనుమరుగైపోతున్న తరుణంలో మళ్ళీ ఫోర్త్ వేవ్ అనే ప్రచారం కొంచెం టెన్షన్ పెడుతున్నప్పటికీ సంవత్సరం క్రితమే కుదుటపడిన బాక్సాఫీస్ ఇంకోసారి ఏదైనా ముంచుకొస్తే తట్టుకోవడం కష్టం. బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు, హిట్లు, డిజాస్టర్లు అన్నీ ఈ ఆరు నెలల కాలంలో చాలానే పలకరించాయి. ఓటిటి ట్రెండ్ లో చాప కింద నీరులా ముంచుకొస్తున్న తరుణంలో ఈ సునామిని తట్టుకోవడం పెద్ద సవాల్ గా మారుతోంది. […]