చంద్ర వెళ్లిపోయారు. ఇక్కడ గీయాల్సినవి అయిపోయాయి. వేరే లోకంలో బొమ్మలు గీసే పని మీద వెళ్లిపోయారు. ఆయనతో నాకు పెద్దగా పరిచయం లేదు. బొమ్మలతో 40 ఏళ్ల స్నేహం. ఆయన గీతలు చూస్తూ పెరిగినవాన్ని. బొమ్మని చూసి కథలు చదివేవాన్ని. కథలు ఆయన బొమ్మలతో వస్తే రచయితలు గర్వగా చెప్పుకునే కాలం. నా కథ కూడా చంద్ర బొమ్మతో రావాలని ఆశపడ్డాను. కుదరలేదు. ఇక కుదరదు. చంద్రని రెండుసార్లు చూసాను. 2000 సంవత్సరంలో పులికంటి కృష్ణారెడ్డి తిరుపతి […]