రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పడిపోతున్నాయి. గడ్డ కట్టే చలిని సైతం లెక్కచేయక రోజూ వందల మంది వచ్చి ఉద్యమంలో చేరుతున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు. ఢిల్లీ శివార్లలో టెంట్లు వేసుకుని రైతులు ఉద్యమం కొనసాగిస్తున్నారు. మరోవైపు రైతు ఉద్యమానికి రాజకీయ, ప్రజా సంఘాల మద్దతు కూడా రోజురోజుకూ పెరుగుతోంది. చట్టాల రద్దు నిమిత్తం పార్లమెంట్‌ను అత్యవసరంగా సమావేశపరచాలని శిరోమణి అకాలీదళ్ డిమాండ్ చేసింది. ఇంకా తాత్సారం చేస్తే ఆందోళన చేయిదాటిపోతుందని […]