ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్గా సీనియర్ ఐపీఎస్ అధికారి దామోదర్ గౌతమ్ సవాంగ్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించాక ఆయన ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ ఉద్యోగులు, సిబ్బంది గౌతమ్ సవాంగ్కు అభినందనలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే 2019 జూన్ 1న రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్ […]