ఇటీవల బీజేపీ కేంద్ర పాలక వర్గం ప్రకటనల్లో కరుడుగట్టిన బీజేపీ నాయకులకే పదవులిచ్చారని, తద్వారా కష్టపడేవారికే ప్రాధాన్యం లభించిందని అంతా అన్నారు, అనుకున్నారు. మెజార్టీ వాస్తవం కూడా ఇదే. కానీ విశాఖ ఎంపీగా, ఏపీ బీజేపీలో కీలకమైన నాయకుడిగా కూడా చాలాకాలం సేవలందించిన కంభంపాటి హరిబాబు విషయంలో బీజేపీ పెద్దలు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆదినుంచీ బీజేపీలోనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా గెలిచారు […]