చిత్తూరు జిల్లా టీబీ ఆస్పత్రిలో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి వ్యవహారం రోజుకో మలుపుతిరుగుతోంది. పెనుమూరు ప్రాథమిక వైద్యశాలలో పని చేస్తున్న సమయంలో వైద్యం విషయంలో వైసీపీ నేతలు తనను వేధించారంటూ ఆరోపణలు చేసిన అనితారాణీ ఇటీవల వార్తల్లో నిలిచారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన టీడీపీ నేతలు అనిత, వర్ల రామయ్య ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. […]
చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రాథమిక వైద్యశాలలో వైద్యురాలిగా పని చేస్తున్న వైద్యురాలు అనితారాణి వ్యవహారంలో నిజానిజాలు ఏమిటో తేల్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు. తనను కూడా డాక్టర్ సుధాకర్లా వైసీపీ నేతలు వేధించారంటూ ఇటీవల అనితారాణి ఆరోపించారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని డాక్టర్ అనితారాణి.. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో నిజానిజాలు […]