కరోనా వైరస్ కారణంగా మార్చి 15వ తేదీన వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వైఖరిని తేల్చి చెప్పింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నవంబర్లో ఎన్నికలు నిర్వహించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బ్యాంకర్లతో సమావేశం అనంతరం గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బిహార్ శాసన సభ ఎన్నికలతో రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చలేమన్నారు. శాసన సభ ఎన్నికలు […]