రైతే రాజు.. అనే మాటను నిజం చేసేందుకు ప్రయత్నించిన వారిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నదాతల వృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశానికి అన్నం పెట్టేందుకు అప్పులపాలవుతున్నా కూడా కాడె వదలని రైతన్నకు వెన్ను దన్నుగా నిలబడిన నేత ఎవరని అడిగితే.. ప్రతి రైతు వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు చెబుతారు. దేశంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చిన ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచారు. […]
మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. కమ్మగా పాడనా కంటి పాప జోల. కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల. ఇది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ నటించిన ఓ సినిమాలో బాగా ప్రాచుర్యం పొందిన పాట. కానీ తాజాగా గురువారం ఏపీ అంతటా మావయ్య అన్న పిలుపు మార్మోగింది. లక్షలాది మంది విద్యార్థులు మావయ్య అంటూ సంభోధించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. జగనన్న విద్యా కానుక అందుకున్న […]
వైసీపీ ప్రభుత్వం మరో పథకంలో డోర్ డెలివరీ ప్రక్రియను ప్రారంభించింది. రైతులకు కావాల్సిన విత్తనాల నుంచి ఎరువుల వరకూ అన్ని గ్రామంలోనే అందుబాటులో ఉండేలా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)లో ఎరువులను ఇకపై రైతుల ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నారు. ఈ ప్రక్రియను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడతో కలసి లాంఛనంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇకపై రైతులు ఎరువులు బుక్ […]
వైసీపీ అధినేత జగన్ మానస పుత్రిక అయిన వలంటీర్ వ్యవస్థలోని గ్రామ , వార్డ్ వలంటీర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ వైసీపీ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ అధికారం చేపట్టాక ప్రభుత్వం అందించే పౌర సేవలు వారి ఇంటి వద్దనే అందించేందుకు ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు 500 విధాల సర్వీసులు నేరుగా ఆయా కుటుంబాల చెంతకు చేర్చడంలో విజయవంతమైన వలంటీర్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచం దృష్టిని […]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లు. అన్నింటికి ఒకే సారి పాలక మండళ్ల ప్రకటన. తెలుగు రాజకీయ చరిత్రలో బీసీలకు ఆర్థికంగా దన్నుగా నిలిచేలా కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు.. వారికి రాజకీయంగా పెద్దపీట వేయడం ఇదే తొలిసారి. ఎలాంటి ప్రచార ఆర్భాటం, హడావుడి, ఓట్ల లక్ష్యం లేకుండా జగన్ సర్కార్ బీసీ కార్పొరేషన్లు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్ పదవులను ఈ రోజు ప్రకటించబోతోంది. మొత్తం 56 బీసీ కార్పొరేషన్లకు […]