డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ గ్రూప్స్ కి చెందిన ఆంధ్రభూమి దినపత్రిక సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది.ఆర్థిక ఇబ్బందులతో పత్రిక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.ఏ క్షణంలోనైనా పత్రిక మూత పడవచ్చననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు నాలుగు నెలలుగా నిలిచిపోయాయి. మరోవైపు డెక్కన్ క్రానికల్ ఇంగ్లీష్ పత్రిక పలుచోట్ల మూత పడుతుంది. కొచ్చి,కోల్ కతా,ముంబై ఎడిషన్లు నిలిపివేశారు.బెంగళూరు ఎడిషన్ కూడా మూత దిశగా సాగుతోంది. దాంతో లాభాలు ఆర్జించే డిసి నిలిచిపోతే,ఇక ఆంధ్రభూమి నిర్వహణ సాధ్యం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. […]