iDreamPost
iDreamPost
మునుగోడు ఎన్నిక తెలంగాణ రాజకీయాలకు హీట్ పుట్టిస్తోంది. ముక్కోణపోరులో గెలుపుకోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు మునుగోడుపైనే ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకుక కేసీఆర్ బహింగ సభతో దడదడలాడిస్తే, ఆ తర్వాత వంతు బీజేపీది. ఆదివారం బీజేపీ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చారు. కీలక ప్రసంగం చేశారు.
ఈసమయంలోనే అమిత్ షాకు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్పులు అందించడంపై వివాదం రగిలింది. అదునుచూసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేత అద్ధంకి దయాకర్ , తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారంటూ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది. జై తెలంగాణ!’’ అంటూ వీడియోను పోస్టు చేశారు.
ఢిల్లీ "చెప్పులు" మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది.
జై తెలంగాణ! https://t.co/SpFCHAszYe
— KTR (@KTRTRS) August 22, 2022
కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వ్యాఖ్యాలతో కాస్త దెబ్బతిన్న కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ఈ ఘటనపై స్పందించారు. బానిస రాజకీయాలకు భాజపా తెర తీసింది. బండి సంజయ్ ఏకంగా అమిత్ షా చెప్పులు మోశారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోదీ, షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు.