Idream media
Idream media
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్యం బాగా లేదంటూ సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలు ప్రచారం చేసిన నలుగురిని అరెస్టు చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ భావనగర్ లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐటి చట్టం ప్రకారం వీరు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అమిత్ షా పేరున నకిలీ ట్విట్టర్ ఖాతా ను క్రియేట్ చేసి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటూ నిందితులు పోస్ట్ చేశారు
”ప్రియమైన ప్రజలారా నేను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేశ హితం కోసమే. నేను ఎవరిని కులపరంగా, మతపరంగా ద్వేషించడం లేదు. కొన్ని రోజులుగా ఆరోగ్యం సరిగ్గా లేనందున దేశ ప్రజలకు సరిగా చేయలేక పోతున్నా. నేను బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నా. నేను తొందరగా కోలుకోవాలని రంజాన్ సందర్భంగా ముస్లిం లు ప్రార్థన చేయండి.తొందర్లోనే మళ్ళీ మీముందుకు వస్తా..” అని అమిత్ షా అన్నట్లుగా ట్విట్టర్లో వీరు నలుగురు పోస్ట్ విడుదల చేశారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమితా సన్నిహితులు, మిత్రులు ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్యంపై వాకబు చేయడం ప్రారంభించారు. దీంతో నేరుగా అమిత్ షా నే తన ఆరోగ్యం పై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, ఇలాంటి వదంతులు నమ్మవద్దని ఆయన ప్రజలను నిన్న శనివారం కోరారు.