iDreamPost
iDreamPost
కరోనాను నియంత్రించడంలో ఉద్ధవ్ సర్కార్ విఫలమైందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నారాయణ రాణే వ్యక్తిగత వ్యాఖ్యలని, బిజెపి వ్యాఖ్యలు ఎంత మాత్రమూ కావని ఆయన తేల్చి చెప్పారు. కరోనా కట్టడిలో ప్రతి రాష్ట్రమూ ఇతోధికంగా, సమర్థవంతంగా తమ తమ పాత్ర నిర్వహించాయని ఆయన పేర్కొన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే పాలన అనుభవ రాహిత్యంపై అడగ్గా…. ఇలాంటి విషయాలు మాట్లాడడానికి అసలు ఇష్టపడనని తేల్చి చెప్పారు. ప్రతి రాష్ట్రమూ కరోనాను ఎదుర్కుంటేనే ఉందని, ఎవరో అద్భుతంగా పనిచేశారు, ఎవరు చేయలేదన్నది చెప్పడం మంచి పద్ధతి కాదని అన్నారు. కరోనాను కేంద్రం ఎదుర్కోవాలని, అలాగే రాష్ట్రం, ప్రతి మనిషీ ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. అంతేగానీ… ఒక రాష్ట్రం బాగా పనిచేసిందని, మరో రాష్ట్రం బాగా పని చేయలేదని చెప్పడం సరైన విధానం కాదని షా స్పష్టం చేశారు.