రాజధాని కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాజధాని కేసులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు హైకోర్టే ప్రభుత్వం అయితే.. అక్కడ ప్రభుత్వం ఎందుకు ? హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా ? అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రికరిస్తే ఎలా ? హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని సుప్రీం వ్యాఖ్యనించింది. 6 నెలల్లో అమరావతి పనులు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే […]
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై న్యాయస్థానాల్లో వివాదాలు తుది దశకు వచ్చాయి. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ అమరావతి జేఏసీ, టీడీపీ సహా పలువురు దాఖలు చేసిన పిటీషన్లపై నేడు (గురువారం) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డి.వి.ఎస్.ఎస్ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. పాలనా వికేంద్రీకరణ, సాగు చట్టాల రద్దులను వ్యతిరేకిస్తూ దాఖలైన […]
అధికార వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల అంశంపై రాష్ట్రంలో మళ్లీ కాక రేగుతోంది. కోర్ట్ విచారణ నిలిచిపోవడం, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండటం వంటి కారణాలతో గత కొంతకాలంగా ఈ విషయంలో స్తబ్దత నెలకొంది. ఎన్నికలు పూర్తి కావడంతో పాటు గత రెండు మూడు రోజులుగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై చేస్తున్న వ్యాఖ్యలు మళ్లీ ఈ ప్రక్రియ జోరందుకుందన్న సంకేతాలు ఇస్తున్నాయి మే 3 నుంచి […]
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. విశాఖలో వైసీపీ గెలిస్తే.. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అనుమతి ఇచ్చినట్లేనన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అమ్మేది కేంద్రప్రభుత్వమైతే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందులో దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడిన చంద్రబాబు.. కార్యనిర్వాహక రాజధాని అంశంపై మాత్రం ఇలాంటి హెచ్చరిక ప్రకటన చేయలేదు. విశాఖలో వైసీపీ గెలిస్తే.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను […]
అమరావతి రాష్ట్ర భవిష్యత్. ఐదు కోట్ల ప్రజలది. నేను ఉంటే ఇంకో పది పదిహేనేళ్లు ఉంటా. మీ భవిష్యత్ కోసం అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమం చేయండి. యువత కదిలి రండి.. ఇలా ఏడాదికి పైగా అమరావతి తప్పా మరే అంశంపై కూడా దృష్టి పెట్టని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. తాజాగా పంచాయతీ ఎన్నికల కోసమంటూ విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోలో అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తామనే విషయాన్ని పొందుపరచకపోవడం ఆశ్చర్యంగా […]
అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా కొన్ని తప్పులు చేయడం సహజం. పాలకుల విధానాలు నచ్చనప్పుడు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. అది ఆందోళనల రూపంలో కనిపిస్తుంది. సాధారణంగా ప్రభుత్వంపై ఆందోళనలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ.. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు విధానాలపై నిరసనలు వ్యక్తమవుతుండడం గమనార్హం. అది కూడా ఏ ప్రత్యర్థి పార్టీయే.. ఆ పార్టీకి చెందిన నేతలో కాదు.. ప్రజా సంఘాలు. ఆ నిరసనలో భాగంగా చంద్రబాబుపై వాళ్లకున్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న తీరును పరిశీలిస్తే […]
రెఫరెండం.. రెఫరెండం అంటూ రంకెలేసిన నారా చంద్రబాబునాయుడికి బిగ్ కౌంటరే పడింది. ఏకంగా వైఎస్సార్సీపీ కీలకనేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముందుకొచ్చారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికనే రిఫరెండంగా పెట్టుకోమని నేరుగా సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాలని సూచించారు. దీంతో చంద్రబాబు చేసిన సవాల్‌కు ధీటుగాగానే సమాధానమిచ్చినట్టయింది. అమరావతి ఉద్యమం ప్రారంభించి యేడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విపరీత ఆరోపణలకు దిగిన చంద్రబాబు సైడు నుంచి […]
‘అమరావతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం’.. అంటూ కమ్యూనిస్టు పార్టీ జాతీయకార్యదర్శి కె. నారాయణ ఎదుటివారి గుండెలదిరించే స్టేట్‌మెంటొకటి ఇచ్చేసారు. ఆయన ఉన్న పార్టీ మౌలిక సిద్ధాంతాలనే మర్చిపోయారో లేక ‘మనస్సు’లో ఉన్న నాయకులకు మంచి చేయాలనుకునే తాపత్రయ పడ్డారో గానీ నారాయణ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు భారీగానే ట్రోల్ అవుతోంది. అభివృద్ధి అందరికీ, అన్ని ప్రాంతాలకీ సమానంగా అందాలన్న సిద్ధాంతాన్నే కమ్యూనిస్టు పార్టీలు చెబుతుంటాయి. ఆ పార్టీలో ఉన్న నారాయణ మాత్రం అందుకు భిన్నంగా కామెంట్లు […]
ప్రాంతాల మధ్య అసమానతలకు అభివృద్ధి కేంద్రీకరణ ప్రధాన కారణం. ఒకే రాష్ట్రంలోని వేరు వేరు ప్రాంతాల మధ్య అసమ అభివృద్ధి ప్రజల్లో అసంతృప్తికి కారణంగా మారుతుంది. ఫలితంగా ప్రాంతీయ ఉద్యమాలు అనివార్యమవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుభవాలు చెప్తున్న పాఠాలివి. రాష్ఱ్ర విభజనకు మూలంగా నిలిచింది కూడా అసమ అభివృద్ధే. మరోమారు ప్రజల్లో అలాంటి అసంతృప్తికి అవకాశం కల్పించకూడదనుకుంటే అన్ని ప్రాంతాల అభివృద్ధిపైనా ప్రభుత్వాలు దృష్టిసారించాల్సి ఉంటుంది. ఆ దిశలో అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు […]
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వింత పరిస్థితి ఎదురవుతోంది. అధినేత చంద్రబాబునాయుడు తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఇలా అయితే ప్రజలను ఎలా ఆకట్టుకుంటాం.. అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు కారణం చంద్రబాబు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడమే. కరోనా పేరు చెప్పి చంద్రబాబు ఇప్పటికీ ఆన్ లైన్ సమావేశాలే ఎక్కువగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోనే ఎక్కువ రోజులు గడుపుతున్నారు. అసెంబ్లీ ఫలితాల అనంతరం నుంచే తెలుగుదేశం గ్రాఫ్ ఏపీలో పడిపోతూ వస్తోంది. అప్పుడే కేవలం […]