iDreamPost

రూ. 200 ఇస్తా వస్తావా అంటే .. తెలియక వెళ్ళా! ఇష్టం వచ్చినట్టు చేశాడు: కీర్తి భట్!

  • Published May 02, 2024 | 7:22 PMUpdated May 02, 2024 | 7:22 PM

సీరియల్ నటి కీర్తి భట్ రియల్ లైఫ్ చూస్తే.. సినిమా కష్టాలు, సీరియల్ కష్టాలకు మించే ఉన్నాయి. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన కీర్తి భట్ ఒక అనాధ అని, ఆమెకు ఎవరూ లేరు ఓ యాక్సిడెంట్ లో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయిందనే విషయం తెలిసిందే. అయితే తాజాగా తాను యాక్సిడెంట్ సమయంలో వరుసకు మామ అయిన వాడి చేతిలో ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాను, సీరియల్లో నటి వరకు తన జర్నీ ఎలా మొదలైందో కీర్తి భట్ చెప్పుకొచ్చింది.

సీరియల్ నటి కీర్తి భట్ రియల్ లైఫ్ చూస్తే.. సినిమా కష్టాలు, సీరియల్ కష్టాలకు మించే ఉన్నాయి. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన కీర్తి భట్ ఒక అనాధ అని, ఆమెకు ఎవరూ లేరు ఓ యాక్సిడెంట్ లో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయిందనే విషయం తెలిసిందే. అయితే తాజాగా తాను యాక్సిడెంట్ సమయంలో వరుసకు మామ అయిన వాడి చేతిలో ఎలాంటి ఇబ్బందులకు గురయ్యాను, సీరియల్లో నటి వరకు తన జర్నీ ఎలా మొదలైందో కీర్తి భట్ చెప్పుకొచ్చింది.

  • Published May 02, 2024 | 7:22 PMUpdated May 02, 2024 | 7:22 PM
రూ. 200 ఇస్తా వస్తావా అంటే .. తెలియక వెళ్ళా! ఇష్టం వచ్చినట్టు చేశాడు: కీర్తి భట్!

బిగ్ బాస్ ఫేమ్,సీరియల్ నటి కీర్తి భట్.. గత కొన్నిరోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో మారు మోగుతున్న విషయం తెలిసిందే. అయితే పేరుకు కన్నడ భామ అయిన కీర్తి భట్ తెలుగులోనే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకంది. కాగా, ఈమె 2019లో మనసిచ్చి చూడు అనే సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ సీరియల్ లో ఆమె అద్భుతమైన నటనతో బుల్లితెర ఆడియన్స్ కు దగ్గరైంది కీర్తి భట్. దీని తర్వాత.. కార్తీకదీపం సిరీయల్ లో కీర్తి నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే 2022లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతానికి ఈ బ్యూటీ మధురానగరిలో అనే సీరియల్ లో నటిస్తుంది. ఇకపోతే ఒక నటిగా ఎంతో పాపులారిటి సంపాదించుకున్న కీర్తి జీవితంలో.. ఎన్నో కష్టాలు , చెప్పుకొలేని బాధలు దాగివున్నాయనే విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మాడు వరుసకు మామ అయ్యే వ్యక్తి చేతిలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో తాజాగా చెప్పుకొచ్చింది.

సీరియల్ నటి కీర్తి భట్ రియల్ లైఫ్ చూస్తే.. సినిమా కష్టాలు, సీరియల్ కష్టాలకు మించే ఉన్నాయి. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన కీర్తి భట్ ఒక అనాధ అని, ఆమెకు ఎవరూ లేరు ఓ యాక్సిడెంట్ లో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయిందనే విషయం తెలిసిందే. కాగా, అదే యాక్సిడెంట్ లో తీవ్ర గాయాల పాలైన కీర్తి భట్.. కొన్నాళ్ల పాటు కోమాలో ఉంది. ఇక జివీతంలో ఎన్నో ఒడుదుడుకులను ఇబ్బందులను ఎదుర్కొన్న కీర్తి భట్.. తాను యాక్సిడెంట్ సమయంలో ఎలాంటి ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలను ఎదుర్కొందో, నటిగా తాను ఎలా ఎదిగానో తాజాగా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా కీర్తి భట్ మాట్లాడుతూ.. నన్ను పెళ్లి చేసుకుంటానని మా మామయ్య అనడంతో.. మా నాన్న ఒప్పుకోలేదు. నాకు కూతుర్ని చంపుకునైనా చంపుకుంటానేమో కానీ నీకు మాత్రం ఇవ్వనని అనేవారట. అయితే నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత.. నేను 32 రోజులు బెంగుళూరు హాస్పిటల్‌లోనే ఉన్నాను. ఇక నేను కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత.. మా మామయ్య వాళ్ల ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. కానీ, ఆ సమయంలో నేన చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేశాను.

KeerthiBUtt

ఎందుకంటే.. నేను కదల్లేని స్థితిలో ఉంటే.. అతను నన్ను ఎక్కడెక్కడో తాకేవాడు. కానీ, అప్పుడు నా శరీరం నా స్వాధీనంలో ఉండేది కాదు. శవంలా పడి ఉండేదాన్ని. శరీరంలో ఏ పార్టూ పనిచేసేది కాదు. కానీ అతను అలా చేస్తున్నప్పుడు ఏదో చేస్తున్నాడని తెలిసేది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నా మీద చేయి వేసినప్పుడు.. ఆ చేతిని పక్కకి నెట్టడానికి కూడా నాలో శక్తి లేదు. ఇక నన్ను ఇలా చేస్తున్నారనే విషయం ఎవరికై చెప్పాలి అనుకున్నా.. వినే పరిస్థిలో ఎవరు లేరు. అందరూ ఆస్తిని ఎలా తీసుకోవాలి అనే ఆలోచనలో ఉండేవారు. అయితే నాకు ఓపిక వచ్చాక కేవలం 350 రూపాయిలతో బయటకు వచ్చేశాను. అవి కూడా దొంగతనుం చేసి తెచ్చినవే. ఇక అర్ధరాత్రి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఇక నా దగ్గర కొంతమంది వచ్చి రూ.200 ఇస్తా వస్తావా? అంటే.. నాకు పెద్దగా ఏం తెలియక. రూ.200 ఇస్తానంటున్నారు కదా.. అని సరే అన్నా వస్తా అనేదాన్ని. తరువాత వాళ్ల చూపులు ప్రవర్తన తెలిసి.. వాళ్ల దగ్గర నుంచి పారిపోయాను.ఇక కొందరు నా మెడలో చిన్న చైన్ ఉంటే..అది కూడా మోసం చేసి రూ. 500 ఇచ్చి తీసుకున్నారు.

ఇక మొదట్లో నేను ప్రొడక్షన్‌ క్యాటరింగ్‌లో పనిచేసేదాన్ని. ఆ తర్వాత.. ఇంటింటికీ తిరిగి బుక్స్, డిక్షనరీలు అమ్మేదాన్ని. ఒక ఆర్నెళ్లు పాటు అదే పనిచేశాను.  కొన్నాళ్లకి కన్నడలో చిన్న చిన్న ఆఫర్లు ఉన్నాయని రమ్మనేవారు.కాగా, అక్కడ జూనియర్ ఆర్టిస్ట్‌గా సీరియల్ ఉంది వస్తావా? అని పిలిచేవారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే.. జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండేది.. మనం ఎక్కడో ఉండేవాళ్లం. అస్సలు కనిపించేవాళ్లమే కాదు. కానీ, ఓ రోజు కన్నడ సీరియల్‌లో క్యారెక్టర్ ఛేంజ్ చేస్తున్నామని ఆడిషన్స్ పిలిచారు. నా రూపం చూసి.. నేనూ ఆడిషన్స్‌కి వచ్చానంటే.. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు అక్కడ పని వాళ్ల దగ్గర అని అనేవారు. ఎందుకంటే.. నాకు ఆడిషన్స్‌కి ఎలా వెళ్లాలో కూడా తెలియదు. మేకప్ వేసుకోవడం కూడా తెలియదు.. ఏదో పౌడర్ పూసుకుని వెళ్లిపోయా. చూడ్డానికి మంచిగా ఉండేదాన్ని కాదు. కోమాలోకి వెళ్లి వచ్చిన తర్వాత..అస్థిపంజరం మాదిరిగా తయారయ్యాను.

KeerthiBUtt

కాగా, శరీరం మొత్తం దెబ్బలు, మచ్చలతో నా ఫేస్ నాకే నచ్చేది కాదు. ఇక అయినా ఆడిషన్స్‌కి వెళ్లాను. సీన్ ఇచ్చారు చేశాను.. అది అయిన తర్వాత.. ప్రొడక్షన్ మేనేజర్ దగ్గరకు వెళ్లి సార్ ఎప్పుడు పిలుస్తారు? అని అడిగాను. దానికి ఆయన నా వైపు సీరియస్‌గా చూసి.. ‘వెళ్లి నీ ముఖం ఓసారి అద్దంలో చూస్కో’ అని అన్నారు. కానీ సరిగ్గా రెండేళ్లు అయిన తర్వాత.. సేమ్ అదే సీరియల్‌కి నాకు మెయిన్ లీడ్ రోల్ వచ్చింది. అప్పుడు ఆ ప్రొడక్షన్ మేనేజర్ పక్కనే కూర్చుని.. ‘ఇదే ఫేస్ సార్.. బాగుందా? ఇప్పుడు? అని అడిగేసి వచ్చా. అతని మాటకి నా వర్క్‌తోనే సమాధానం ఇచ్చాను అంటూ కీర్తి భట్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. మరి, కీర్తి భట్ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి