iDreamPost

వీడియో: బాలరాముని సూర్య తిలకం.. ఈ కాన్సెప్ట్ రాజమౌళికి ఎప్పుడో వచ్చింది!

బలరాముని నుదిటి మీద పడుతున్న సూర్యతిలకం కాన్సెప్ట్ ని రాజమౌళి ఆరేళ్ళ క్రితమే ఆలోచించారని మీకు తెలుసా? అవును జక్కన్న క్రియేటివిటీ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.

బలరాముని నుదిటి మీద పడుతున్న సూర్యతిలకం కాన్సెప్ట్ ని రాజమౌళి ఆరేళ్ళ క్రితమే ఆలోచించారని మీకు తెలుసా? అవును జక్కన్న క్రియేటివిటీ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.

వీడియో: బాలరాముని సూర్య తిలకం.. ఈ కాన్సెప్ట్ రాజమౌళికి ఎప్పుడో వచ్చింది!

అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత బుధవారం మొదటి శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశం సూర్య తిలకం. నేరుగా బాల రాముడి నుదిటి మీద సూర్యకిరణాలు పడడం విశేషం. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున బలరాముని నుదిటి మీద సూర్యకిరణాలతో తిలకం ఏర్పాటు చేయడమే ఈ సూర్య తిలకం ముఖ్య ఉద్దేశం. గర్భ గుడిలో ఉండే బాల రాముడి నుదిటిపై సూర్య తిలకాన్ని గుడి మూడవ అంతస్తు నుంచి చూసేందుకు ఏర్పాట్లు చేశారు. 58 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న సూర్య తిలకం మూడున్నర నిమిషాల పాటు భక్తులకు కనువిందు చేసింది. అయితే ఈ సూర్య తిలకం కాన్సెప్ట్ రాజమౌళికి ముందే వచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయాక ఏపీ రాజధానిగా అమరావతి అని అన్నారు. రాజధానిలో నిర్మించబోయే అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లు ఎలా ఉంటే బాగుంటుందో అనే అంశాన్ని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాజమౌళికి అప్పగించారు. అప్పటికి రాజమౌళి బాహుబలి సినిమాలో భారీ సెట్స్ వేయించిన విధానం కానీ ఆయన విజన్ కానీ చాలా ఇంప్రెసివ్ గా ఉండేవి. రాజమౌళి విజన్ నుంచి వచ్చింది ఏదైనా కానీ అమలు అయితే ఆ విజువల్ ట్రీట్ ఓ రేంజ్ లో ఉంటుంది. రాజమౌళికంటే నిర్మాతలు ఉంటారు.. విజన్ కి పెట్టుబడి పెడతారు. ఆయన విజన్ ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తారు. కానీ ఇక్కడ ఉన్నది చంద్రబాబు కదా.. ఆయన విజన్ ని అలానే గాలికి వదిలేశారు. గ్రాఫిక్స్ ని గ్రాఫిక్స్ కే పరిమితం చేసి రాజమౌళి కష్టానికి ఫలితం లేకుండా చేశారు.

This concept never came to Rajamouli 02

ఇక అసలు విషయానికొస్తే.. అప్పట్లో రాజధాని డిజైన్ టాస్క్ ని రాజమౌళికి అప్పగించారు. అప్పట్లో లండన్ లో నార్మన్ ఫోస్టర్ ఆర్కిటెక్ట్ సంస్థ ప్రతినిధులకు డిజైన్లకు సంబంధించి సలహాలు ఇచ్చారు. అసెంబ్లీ భవనం ఎలా ఉండాలి? మన సంస్కృతి, వారసత్వం, చరిత్ర ప్రతిబింబించేలా కొన్ని సలహాలను వారికి వివరించారు. ఈ క్రమంలోనే రాజమౌళి అసెంబ్లీలో తెలుగు తల్లి విగ్రహం డిజైన్ ఐడియాను రూపొందించారు. టెక్నాలజీ సహాయంతో తెలుగు తల్లిపై సూర్యకిరణాలు పడేలా డిజైన్ చేసిన వీడియోని ప్రెజెంట్ చేశారు. ప్రతి రోజూ ఉదయం 9.15 గంటలకు అసెంబ్లీ సెంట్రల్ హాల్ లో ఉన్న తెలుగు తల్లి విగ్రహం పాదాలను తాకేలా డిజైన్ చేశారు. ఆ తర్వాత ఆ సూర్య కిరణాలు తెలుగు తల్లి ముఖంపై పడేలా అప్పట్లో ఒక వీడియోని రూపొందించారు. ఆ సూర్యకిరణాలు పడుతున్న సమయంలో ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అనే పాట వస్తుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

అప్పట్లోనే రాజమౌళి తన విజన్ తో సూర్యకిరణాలు తెలుగు తల్లిని తాకే విధంగా భలే డిజైన్ చేశారని మెచ్చుకుంటున్నారు. ఇది ఇంప్లిమెంట్ కాలేదు కానీ అయి ఉంటే నిజంగా బాగుండేది. కానీ చంద్రబాబు వల్ల రాజమౌళి ప్రతిభకి, కష్టానికి ఫలితం లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. అయితే రాజమౌళి ఈ సూర్యకిరణాల కాన్సెప్ట్ ని పలు కట్టడాల నుంచి ఆదర్శంగా తీసుకుని చేశారు. శ్రీకాకుళంలో ఉన్న అసరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతి ఏటా రెండుసార్లు స్వామి వారి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకుతాయి.  గుడిమల్లం పరశురామ ఆలయం, పుదుచ్చేరిలో ఉన్న మాద్రి మందిర్ లో స్వామి వారి మీద సూర్యకిరణాలు పడతాయి. గుజరాత్ లో ఉన్న మొధేరా సూర్య దేవాలయంలో కూడా ఏడాదిలో రెండుసార్లు సూర్యకిరణాలు స్వామి వారిపై పడతాయి. ఒడిశాలో ఉన్న కోణార్క్ సూర్యదేవాలయంలో కూడా సూర్యోదయ సమయాన సూర్యకిరణాలు పడడం విశేషం. ఇంకా ఇలాంటి ఆలయాలు ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ ఆదర్శంగా తీసుకునే రాజమౌళి సూర్య కిరణాలను తెలుగు తల్లి విగ్రహం మీద పడేలా చేశారు. బాలరాముని నుదిటిపై సూర్యకిరణాలు పడుతున్న వేళ రాజమౌళి అప్పట్లోనే ఆలోచించారని వీడియోని వైరల్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి