iDreamPost

అధిక రాబడి కావాలా.. పదేళ్లలో 17 లక్షలు అందిస్తున్న పోస్టాఫీస్ స్కీమ్ ఇదే!

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఇన్వెస్ట్ చేసి అధిక లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్ ద్వారా పదేళ్లలో 17 లక్షలు పొందొచ్చు. ఇప్పుడే ప్రారంభించండి.

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ఇన్వెస్ట్ చేసి అధిక లాభాలను పొందాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్ ద్వారా పదేళ్లలో 17 లక్షలు పొందొచ్చు. ఇప్పుడే ప్రారంభించండి.

అధిక రాబడి కావాలా.. పదేళ్లలో 17 లక్షలు అందిస్తున్న పోస్టాఫీస్ స్కీమ్ ఇదే!

నేటి రోజుల్లో ప్రతి పని డబ్బుతో ముడిపడి ఉన్నదే. ఓ వ్యక్తికి దక్కే విలువ కూడా డబ్బుపైనే ఆధారపడి పోయింది. అందుకే ప్రపంచమంతా డబ్బు వెనకాల పరిగెడుతోంది. మనీ సంపాదన కోసం మార్గాలను వెతుకుతున్నారు. ఇందుకోసం కొంతమంది ఉద్యోగాలు, వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే సంపాదించిన డబ్బులో భవిష్యత్ అవసరాల కోసం పొదుపు కూడా అవసరమే. అంటే ఏదో ఒక పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి అందుకోవచ్చు. ఇది మీ భవిష్యత్తులో ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టేందుకు అందుబాటులో ఉన్న బెస్ట్​ ఇన్వెస్ట్​మెంట్ స్కీమ్స్​లో ఆర్​డీ(రికరింగ్​ డిపాజిట్​) ఒకటి. ఈ స్కీమ్​లో పెట్టుబడి పెడితే 10 సంవత్సరాల్లో ఏకంగా రూ. 17 లక్షలు అందుకోవచ్చు.

రికరింగ్ డిపాజిట్ అనేది బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో పనిచేస్తున్న ఇండియన్ పోస్టాఫీస్ అందిస్తోంది. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసు ఆర్డీ పథకానికి 6.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు మాత్రమే. మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇందుకోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టే వీలుంది.

2 వేలు పెట్టుబడిపెడితే:

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ఐదు సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టారనుకుంటే.. ప్రతి నెల రూ. 2000 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 24,000 అవుతుంది. ఐదు సంవత్సరాల్లో రూ. 1,20,000 పెట్టుబడి పెడతారు. మీరు పెట్టిన ఈ మొత్తం పెట్టుబడిపై ఐదు సంవత్సరాల తర్వాత 6.7 శాతం వడ్డీతో రూ. 22, 732 పొందుతారు. అంటే ఫైనల్ గా మీ రికరింగ్ డిపాజిట్ మెచ్చూరిటీపై మొత్తం రూ.1,42,732 రాబడిని అందుకుంటారు.

5వేలు ఇన్వెస్ట్ చేస్తే:

పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ఐదు సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టారనుకుంటే.. ప్రతి నెల రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 60,000 అవుతుంది. ఐదు సంవత్సరాల్లో రూ. 3,00,000 పెట్టుబడి పెడతారు. మీరు పెట్టిన ఈ మొత్తం పెట్టుబడిపై ఐదు సంవత్సరాల తర్వాత 6.7 శాతం వడ్డీతో రూ.56,830 పొందుతారు. అంటే ఫైనల్ గా మీ రికరింగ్ డిపాజిట్ మెచ్యూరిటీపై మొత్తం రూ. 3,56,830 రాబడిని అందుకుంటారు.

10 సంవత్సరాల్లో రూ.17 లక్షలు పొందాలంటే:

మీరు ఈ స్కీమ్​లో చేరి పదేళ్లలో 17 లక్షల రూపాయలు పొందాలనుకుంటే.. పెట్టుబడి నెలకు రూ. 10 వేలు పెట్టాల్సి ఉంటుంది. ఈ స్కీమ్​ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. కాబట్టి ఈ సమయానికి మీ మొత్తం పెట్టుబడి వడ్డీతో కలిపి రూ.7 లక్షల 13వేలు అవుతుంది. అయితే మీరు మరో 5 సంవత్సరాలు పొడిగించారని అనుకుంటే అప్పుడు 10 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడి రూ.12 లక్షలు అవుతుంది. దీనిపై వచ్చే వడ్డీ రూ. 5 లక్షల 8వేల 546 అవుతుంది. అంటే 10 ఏళ్ల తర్వాత మీకు అసలు, వడ్డీతో కలిపి 17లక్షల 8వేల 546 రూపాయలు పొందొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి