iDreamPost

చికెన్ బిర్యానీ అని చెప్పి.. పిల్లి మాంసం పెడుతున్నారు! ఇది కొత్త దందా!

పిల్లి మాంసంతో కూడా బిర్యానీ చేస్తున్నారు. మటన్ బిర్యానీగా దాన్ని అమ్మేస్తున్నారు. రోడ్ సైడ్ బిర్యానీ పాయింట్స్ లో ఇదే జరుగుతుంది. ఒక చోట కాదు.. మొత్తం నగర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. దీని కోసం ఒక ముఠానే పని చేస్తుంది. తాజాగా ఈ రహస్య దందా వెలుగులోకి వచ్చింది.

పిల్లి మాంసంతో కూడా బిర్యానీ చేస్తున్నారు. మటన్ బిర్యానీగా దాన్ని అమ్మేస్తున్నారు. రోడ్ సైడ్ బిర్యానీ పాయింట్స్ లో ఇదే జరుగుతుంది. ఒక చోట కాదు.. మొత్తం నగర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. దీని కోసం ఒక ముఠానే పని చేస్తుంది. తాజాగా ఈ రహస్య దందా వెలుగులోకి వచ్చింది.

చికెన్ బిర్యానీ అని చెప్పి.. పిల్లి మాంసం పెడుతున్నారు! ఇది కొత్త దందా!

మాంసం అంటే అందరికీ ఇష్టమే. ఆదివారం వచ్చిందంటే చాలు మీట్ షాపుల దగ్గరికి భారీగా జనం క్యూ కడతారు. ఆన్ లైన్ లో తెగ ఆర్డర్ పెడతారు. చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా ఏదైనా గానీ సన్ డే వచ్చిందంటే కడుపులో పడాల్సిందే. లొట్టలేసుకుంటూ ఆవురావురమంటూ తినాల్సిందే. అయితే కొంతమంది నీచులు కస్టమర్ల డిమాండ్లను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మటన్ బదులు కుక్క మాంసం, పిల్లి మాంసం అమ్ముతున్నారు. కొంతమంది బిర్యానీలో పిల్లి మాంసం కలుపుతున్నారు. ఈ విషయాలను ఓ వ్యక్తి మీడియా ముందు బయటపెట్టారు. రోడ్డు పక్కన ఉండే బిర్యానీ పాయింట్ వాళ్ళు బిర్యానీలో పిల్లి మాంసం వాడుతున్నారని.. ఇందులో ఒక గ్రూప్ ఇన్వాల్వ్ అయి ఉందని.. వీళ్ళు మాంసం దుకాణాలకు ఆ పిల్లి మాంసాన్ని అమ్మడం.. లేదా వాళ్ళే స్వయంగా తినడం చేస్తున్నారని ఆ వ్యక్తి సంచలన విషయాలు వెల్లడించారు.

మటన్ పిల్లి మాంసం నుంచి వస్తుందని షాక్ అయ్యారా? నరికురవర్స్ అనే గ్యాంగ్ కి చెందిన కొంతమంది వ్యక్తులు పిల్లులను కిడ్నాప్ చేస్తున్నారు. అనంతరం ఆ పిల్లులను చంపి వాటి మాంసాన్ని రెస్టారెంట్స్ కి అమ్ముతున్నారు. ఈ దారుణాలు చెన్నైలోని పెరంబూర్ లో జరుగుతున్నాయి. పిల్లులు మిస్ అవుతున్నాయని చాలా మంది ఫిర్యాదులు చేశారు. పిల్లులు ఇలా కిడ్నాప్ కి గురవ్వడం అనేది 2018లో ఇదే ఏరియాలో జరిగింది. కానీ ఇటీవల ఈ పిల్లుల దొంగతనానికి సంబంధించిన ఒక వీడియో బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి పిల్లులను ఎత్తుకెళ్లిపోతున్నారు. ఇటీవల జాషువా అనే వ్యక్తి.. చెన్నై స్పర్ టంక్ రోడ్డులో రాత్రి సమయంలో వీధి పిల్లులకు ఫుడ్ పెట్టడానికి వెళ్ళారు.

అయితే ఆ సమయంలో వీధి పిల్లులను పట్టుకుని కిల్ పాక్ చుట్టుపక్కల తిరుగుతున్న వ్యక్తిని చూశానని.. అతన్ని పట్టుకుని నిలదీస్తే.. ఆ పిల్లులను నగరంలోని రోడ్ పక్కన ఉండే దుకాణాల్లో అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడని జాషువా అన్నారు. దీనిపై నెటిజన్స్ అలానే జంతు ప్రేమికులు రియాక్ట్ అవుతున్నారు. అమాయక జీవులను ఎత్తుకెళ్తున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లుల మాంసం అమ్ముతున్న వాళ్లపై చర్యలు తీసుకోవాలని.. ఆ మాంసం కొనే దుకాణదారులపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి పిల్లి మాంసంతో చేసిన బిర్యానీని మటన్ బిర్యానీగా కలరింగ్ ఇస్తున్న రోడ్ సైడ్ బిర్యానీ పాయింట్ వారిపై.. అలానే పిల్లి మాంసం అమ్ముతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి