iDreamPost

అమరావతి ఎక్కడ బాబు గారు..?

అమరావతి ఎక్కడ బాబు గారు..?

అమరావతి రాష్ట్ర భవిష్యత్‌. ఐదు కోట్ల ప్రజలది. నేను ఉంటే ఇంకో పది పదిహేనేళ్లు ఉంటా. మీ భవిష్యత్‌ కోసం అమరావతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమం చేయండి. యువత కదిలి రండి.. ఇలా ఏడాదికి పైగా అమరావతి తప్పా మరే అంశంపై కూడా దృష్టి పెట్టని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. తాజాగా పంచాయతీ ఎన్నికల కోసమంటూ విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోలో అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తామనే విషయాన్ని పొందుపరచకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్‌ అని చెప్పిన అమరావతి పేరును కూడా టీడీపీ పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనకపోవడం వెనుక ఆంతర్యమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అమరావతి ప్రశస్త్యాన్ని, ప్రాముఖ్యతను, గొప్పతనాన్ని ఇన్నాళ్లు చాటిన చంద్రబాబు.. ఎన్నికలు వచ్చే సరికి ఆ అంశాన్ని పక్కనపెట్టేయడం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి..?

బాబును నిలదీసే టైం ఇది..

400 రోజులకు పైబడి ఉద్యమం చేస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వైసీపీ సర్కార్‌పై మండిపడుతున్న అమరావతి ఉద్యమకారులు, మహిళలు.. ఈ ఉద్యమానికి ప్రధాన కారణమైన చంద్రబాబు చేసిన పనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఉద్యమం చేయాలంటూ ప్రొత్సహించి, తన భార్య చేతి గాజులను ఉద్యమానికి విరాళంగా ప్రకటింపజేసిన చంద్రబాబు.. అమరావతి ఉద్యమ మహిళలను ఢిల్లీకి కూడా పంపించారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి.. కేసులు నమోదు అయ్యేందుకు కారణమయ్యారు. అప్పుడప్పుడు ఉద్యమ సిబిరాలను సందర్శిస్తూ.. ఉద్యమ వేడి చల్లారకుండా చూస్తున్న చంద్రబాబు.. అమరావతి అంశంపై తన కుటిల బద్ధి ఏమిటో ఎన్నికల మేనిఫెస్టో ద్వారా బటయపెట్టుకున్నారు. తనకు రాజకీయం, ఓట్లే ప్రధానమనేలా అమరావతి అంశాన్ని పక్కనపెట్టేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే.. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచుతామనే హామీని ఎందుకు చంద్రబాబు ప్రస్తావించలేదో.. అమరావతి ఉద్యమకారులు టీడీపీ అధినేతను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది.

ఏ మీడియంలో చదువులు చెప్పిస్తారు..?

ఎన్నికల మేనిఫెస్టోలో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. బాలికల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. విద్య గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. చదువును తెలుగు మీడియంలో చెప్పిస్తారా..? లేదా ఇంగ్లీస్‌ మీడియంలో బోధింపజేస్తారా..? అనే విషయం మాత్రం స్పష్టం చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. నాణ్యమైన విధ్యతోనే పేదరికం అంతరిస్తుందని, పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ బలంగా విశ్వసించి.. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో భోదనను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు అండ్‌ కో.. తెలుగు భాషపై ఎనలేని ప్రేమను కురిపించారు. గ్రామీణ పిల్లల చదువుపై ఎంతో శ్రద్ద చూపుతున్నట్లు విద్యకు ప్రాధాన్యతనిస్తామని పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు.. ఆ విద్యను ఇంగ్లీష్‌ మీడియంలో అందిస్తారా..? లేక తెలుగు మీడియంలో బోధింపజే స్తారా..? అనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయరో మరి..!

మాటలకు చేతలకు పొంతన ఉండదా..?

బాబు మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన ఉండని చెబుతుంటారు. తన నైజాన్ని చంద్రబాబే తరచూ రుజువు చేసుకుంటుంటారు. అమరావతి, విద్య అంశాలపై నిన్న మొన్నటి వరకు చంద్రబాబు జూమ్‌ వేదికగా చేసిన హంగామా మాటల్లో వర్ణించలేనది. అమరావతి అంశంగా రెఫరెండం కోరాలన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహంచాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో తాను ఓడిపోతే.. ఇకపై అమరావతి పేరును ఎత్తబోనన్నారు. ఇంగ్లీష్‌ మీడియం వల్ల తెలుగు భాషకు నష్టం వాటిళ్లుతుందన్నారు. ఇంత రచ్చ చేసిన చంద్రబాబు.. ఆ రెండు విషయాలను పంచాయతీ ఎన్నికల సందర్భంగా కనీసం కూడా ప్రస్తావించకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అమరావతి అంశాన్ని ప్రస్తావిస్తే.. షరాఘాతం తప్పదనే బాబు విస్మరించినట్లుగా అర్థమవుతోంది. ఇంగ్లీష్‌ మీడియం పేరు ఎత్తితే.. పల్లె ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని భయపడినట్లుగా ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు జూమ్‌లోకి వెళ్లి మళ్లీ అమరావతి పాట పాడడం షరామూమూలే. ఈ తరహా తీరుతో ఉన్న చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెబుతారో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి