iDreamPost

Tillu Cube: ‘టిల్లు క్యూబ్’ కోసం సిద్ధు జొన్నలగడ్డ మాస్టర్ ప్లాన్.. స్టార్ హీరోయిన్​ను పట్టేశాడు!

  • Published May 02, 2024 | 8:14 PMUpdated May 02, 2024 | 8:14 PM

‘టిల్లు స్క్వేర్’ సూపర్ హిట్ అవడంతో ఫుల్ జోష్​లో ఉన్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఇదే ఊపులో టిల్లు సిరీస్​లో మూడో పార్ట్​కు ఆయన ప్లాన్స్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఓ క్రేజ్ అప్​డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

‘టిల్లు స్క్వేర్’ సూపర్ హిట్ అవడంతో ఫుల్ జోష్​లో ఉన్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఇదే ఊపులో టిల్లు సిరీస్​లో మూడో పార్ట్​కు ఆయన ప్లాన్స్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఓ క్రేజ్ అప్​డేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Published May 02, 2024 | 8:14 PMUpdated May 02, 2024 | 8:14 PM
Tillu Cube: ‘టిల్లు క్యూబ్’ కోసం సిద్ధు జొన్నలగడ్డ మాస్టర్ ప్లాన్.. స్టార్ హీరోయిన్​ను పట్టేశాడు!

సిద్ధు జొన్నలగడ్డ.. ఒకే ఒక్క మూవీతో టాక్ ఆఫ్ ది టౌన్​గా మారాడు. ఆయన నటించిన ‘డీజే టిల్లు’ సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీకి ముందు ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘కల్కి’, ‘మా వింత గాథ వినుమా’ లాంటి పలు చిత్రాలు చేసినప్పటికీ ‘డీజే టిల్లు’తో ఓవర్​నైట్ స్టార్ అయిపోయాడు. టిల్లుగా ఆయన పండించిన కామెడీ, ఎక్స్​ప్రెషన్స్, డైలాగ్ డిక్షన్​కు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సక్సెస్ తర్వాత భారీ ఆఫర్లు వచ్చినా వద్దనుకున్న సిద్ధు.. ఈ మూవీకి సీక్వెల్​తో ఈ వేసవిలో అందరి ముందుకు వచ్చాడు. ‘టిల్లు స్క్వేర్​’తో ఈ సమ్మర్​లో ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్​ను షేక్ చేసిందా చిత్రం. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా థర్డ్ పార్ట్​కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

‘టిల్లు స్క్వేర్​’కు కంటిన్యూగా మూడో పార్ట్ ఉంటుందని మూవీ ఎండింగ్​లోనే చెప్పేశారు మేకర్స్. దీంతో ‘టిల్లు క్యూబ్’పై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ముఖ్యంగా టిల్లు సిరీస్​లో హీరోయిన్లకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే థర్డ్ పార్ట్​లో ఎవర్ని హీరోయిన్​ రోల్​కు తీసుకుంటారోనని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ఓ క్రేజ్ రూమర్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాని ప్రకారం ‘టిల్లు క్యూబ్’లో ఓ టాప్ హీరోయిన్ యాక్ట్ చేయనున్నారట. ఆమె మరెవరో కాదు.. బుట్టబొమ్మ పూజా హెగ్డే అని టాలీవుడ్ సర్కిల్స్​లోనూ జోరుగా వినిపిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ పక్కన యాక్ట్ చేసేందుకు ఈ అందాల రాశి ఓకే చెప్పిందని ఫిల్మ్ నగర్ సమాచారం.

మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్.. అంటూ నిన్న మొన్నటి దాకా టాలీవుడ్​లోని బిగ్ స్టార్స్ పక్కన నటిస్తూ కెరీర్​లో ఫుల్ బిజీగా ఉంది పూజా హెగ్డే. అయితే ఆమె నటించిన సినిమాలు వరుసగా పరాజయాల పాలవడంతో అవకాశాలు తగ్గాయి. మంచి అవకాశం కోసం బుట్టబొమ్మ ఎదురుచూస్తున్న ఈ తరుణంలో ‘టిల్లు క్యూబ్’ ఆఫర్ ఆమె దగ్గరకు వెళ్లిందని తెలుస్తోంది. హిట్ సిరీస్ కావడం, తన రోల్​కు మంచి ఇంపార్టెన్స్ ఉండటంతో పూజ కూడా వెంటనే ఓకే చేసిందనే టాక్ నడుస్తోంది. ‘టిల్లు క్యూబ్’లో పూజా హెగ్డే ఫిక్స్ అయిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీని మీద అటు హీరోయిన్ గానీ ఇటు చిత్ర బృందం నుంచి గానీ ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఈ న్యూస్​లో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సిందే. మరి.. సిద్ధు పక్కన రాధికగా పూజా హెగ్డే నటిస్తే చూడాలని మీరు అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి