iDreamPost

ఎన్నాళ్లిలా : ప్ర‌జాక్షేత్రంలో త‌క్కువ‌… జూమ్ లో ఎక్కువ‌…!

ఎన్నాళ్లిలా : ప్ర‌జాక్షేత్రంలో త‌క్కువ‌… జూమ్ లో ఎక్కువ‌…!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణుల‌కు వింత ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. అధినేత చంద్ర‌బాబునాయుడు తీరు విస్మ‌యానికి గురి చేస్తోంది. ఇలా అయితే ప్ర‌జ‌ల‌ను ఎలా ఆక‌ట్టుకుంటాం.. అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇందుకు కార‌ణం చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌డ‌మే. క‌రోనా పేరు చెప్పి చంద్ర‌బాబు ఇప్ప‌టికీ ఆన్ లైన్ స‌మావేశాలే ఎక్కువ‌గా నిర్వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్ లోనే ఎక్కువ రోజులు గ‌డుపుతున్నారు. అసెంబ్లీ ఫ‌లితాల అనంత‌రం నుంచే తెలుగుదేశం గ్రాఫ్ ఏపీలో ప‌డిపోతూ వ‌స్తోంది. అప్పుడే కేవ‌లం 23 మంది ఎమ్మెల్యేల‌ను అందించి ఆయ‌న చేసిన కార్యాల‌కు అవి చాల‌న్న‌ట్లుగా ప్ర‌జ‌లు అంత‌టితో స‌రిపెట్టారు. ఆ ఫ‌లితాల‌ను చూసిన వారెవ‌రైనా ప్ర‌జ‌ల‌లో త‌మ‌కు వ్య‌తిరేక‌త ఉంద‌ని తెలుసుకుని అది పోగొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తారు కానీ..

గ‌త అసెంబ్లీ ఫ‌లితాల అనంత‌రం దిద్దుబాటు చ‌ర్య‌ల‌లో భాగంగా చంద్ర‌బాబునాయుడు ప్ర‌జ‌ల‌లో మ‌మేకం అవుతార‌ని అంద‌రూ భావించారు. ఆయ‌న త‌ద్విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ ఏడాది అంతా క‌రోనా, వ‌ర‌ద‌లు రాష్ట్రాన్ని ప‌ట్టిపీడించాయి. తాజాగా ఏలూరులో వింత వ్యాధి క‌ల‌క‌లం రేపుతోంది. సాధార‌ణంగా ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు పేరు కోసం, ప్ర‌జ‌ల‌లో సానుభూతి పొంద‌డం కోసం ప్ర‌భుత్వం క‌న్నా.. ప్ర‌తిప‌క్షాలే ముందుగా అక్క‌డ‌కు చేరుకుంటాయి. కానీ ఏపీలో విప‌త్తు ఏం వ‌చ్చినా త‌క్ష‌ణం ప్ర‌భుత్వం స్పందిస్తోంది. బాధితుల‌కు అండ‌గా నిలుస్తోంది. అటువంటి స‌మ‌యాల్లో కూడా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌పార్టీకి అధినేత‌గా చంద్ర‌బాబు ఆశించిన స్థాయిలో నేరుగా ప్ర‌జ‌ల‌తో మాట్లాడింది లేదు. జూమ్ స‌మావేశాలు పెట్టి ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం త‌ప్పా చేసిందేమీ లేద‌నే భావ‌న ప్ర‌జ‌ల‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌ధానంగా క‌రోనా మ‌హ‌మ్మారి పేరుతో హైద‌రాబాద్ కే ప‌రిమిత‌మైన బాబు ఇప్పుడు కూడా అదే విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను, పార్టీ నాయ‌కుల‌ను క‌లిసిన సంద‌ర్భాల‌ను వేళ్ల‌తో లెక్క పెట్ట‌వ‌చ్చు. ఈ ప‌రిణామాల‌న్నీ పార్టీ కేడ‌ర్ ను నిరుత్సాహ‌ప‌రుస్తున్నాయి. ఇప్ప‌టికే 23 మంది ఎమ్మెల్యేల‌లో అత్య‌ధిక మంది ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. దీంతో అసెంబ్లీ కూడా పోరాడే స్థితిలో పార్టీ లేద‌ని తాజా స‌మావేశాల్లో తేలిపోయింది. కేవ‌లం బాబుకు తోడుగా న‌లుగైదుగురు త‌ప్పా.. ఎవ‌రూ అంత‌గా స్పందించ లేదు. త‌న చేష్ట‌ల ద్వారా సానూభూతి పొందే ప్ర‌య‌త్నం చేసినా అది కూడా బేల‌గా మారింది.

ఈ చ‌ర్య‌ల‌న్నీ పార్టీ కేడ‌ర్ ను నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి. ఏలూరులో జ‌రిగిన ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం స‌రిగా స్పందించ‌డం లేదంటూ నిర‌స‌న తెలిపేందుకు పార్టీ నాయ‌కులు సిద్ధ‌మ‌య్యారు. ఇందుకు త‌ర‌లి రావాల‌ని కార్య‌కర్త‌ల‌కు పిలుపునిచ్చారు. కానీ ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా రాలేదు. దీంతో ఆ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌లేదు. ఇది ఒక ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. ఇలా టీడీపీ చేప‌ట్టాల‌నుకుంటున్న చాలా కార్య‌క్ర‌మాలు ఏపీలో ఫెయిల‌వుతున్నాయి. ఇందుకు కార‌ణం అధినేత అప్పుడ‌ప్పుడైనా శ్రేణుల‌కు అందుబాటులో ఉండి స‌రైన ప్రోత్స‌హం అందించ‌క‌పోవ‌డ‌మే.

టూరిస్ట్‌ చంద్రబాబు : ఎంపీ నందిగం సురేష్‌

‘అమరావతికి వచ్చిన టూరిస్ట్‌ చంద్రబాబు’ అంటూ ఎంపీ నందిగం సురేష్‌ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుకి అమరావతిపై ఆరాటం తప్ప.. పోరాటం కాదు. చంద్రబాబు బినామీల ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఈ ఉద్యమం. పేద, బడుగు, బలహీన ప్రజలకు అమరావతిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్యం భూములు కేటాయిస్తే కోర్టుకి వెళ్లారు. అమరావతి ప్రాంతంలో డెమో గ్రాఫిక్ అభివృద్ధి దెబ్బతింటుంది అని చెప్పడం చంద్రబాబు బుద్దిని బయటపెట్టింది. కూడబెట్టుకున్న ఆస్తులు సంరక్షణ కోసం తాపత్రయం తప్ప అమరావతి మీద ప్రేమ కాదు. నాలుగు సంవత్సరాలు అంబేద్కర్ విగ్రహం కట్టడానికి మనసు రాలేదు.. కానీ దళితులకు న్యాయం చేస్తారట’’ అంటూ ఎంపీ సురేష్‌ దుయ్యబట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి