ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత పోస్టు పెట్టారనే అభియోగంపై మరో ప్రభుత్వ అధికారిపై వేటు పడింది. సీఎంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతోపాటు లాక్డౌన్ అమల్లో ఉండగా దుకాణాలు, వ్యాపార సంస్థలకు అనుమతి ఇచ్చినందుకు అమరావతి ఎంపీడీవో పావులూరి ఉమాదేవి సస్పెండ్కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్యామూల్ ఆనంద్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఉమాదేవి ప్రభుత్వ పథకాలు, విధానాలను బాహాటంగా విమర్శించారనే ఆరోపిస్తూ వైసీపీ నాయకులు […]