టిడిపి మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఏవి సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసులో భార్గవ్ కు పోలీసులు నోటీసులిచ్చారు. కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన టిడిపి నేత, ఏపి సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి హత్యకు కుట్ర కేసులో ఇటీవల నలుగురు నిందితులను కడప పట్టణంలోని చిన్నచౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే విచారణకు హాజరుకావాలని అఖిల ప్రియ భర్త భార్గవ్ కు నోటీసులిచ్చారు. […]
మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన అఖిల ప్రియపై ఆరోపణలు గుప్పించారు. మహిళ ముసుగులో అఖిల ప్రియ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపిందని మండిపడ్డారు. రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సూడో నక్సలైట్ సంజోరెడ్డిలతో కలసి అఖిలప్రియ తనను చంపించాలని ప్లాన్ వేసిందని ఆరోపించారు. అందు కోసం 50 లక్షల రూపాయల సుఫారి ఇచ్చేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుందన్నారు. వారికి […]