ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మరణించారు. కరోనా బారిన పడిన ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చందూలాల్, ములుగు శాసనసభా స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు వరంగల్ ఎంపీగా గెలుపొందారు. రెండుసార్లు మంత్రిపదవి చేపట్టి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. టీడీపీ ని వీడి కేసీఆర్ గూటిలో చేరిన […]