2019లో దాదాపు 180 సినిమాలు విడుదలైతే, దాంట్లో కనీసం పది శాతం కూడా హిట్ కాలేదు. మొత్తం లెక్కలు చూస్తే 14 సినిమాలు లాభాలు తెచ్చాయి. మిగిలినవన్నీ ప్లాప్. పెట్టుబడుల్లో పది శాతం వెనక్కి తెచ్చుకోలేని ఇండస్ట్రీని సిక్ ఇండస్ట్రీ అనాలి. ప్రస్తుతం తెలుగు సినిమా జబ్బు పడి ఉంది. ఆడిన 14 సినిమాలు గమనిస్తే ఏమర్థమవుతుందంటే వాటిలో బలమైన కథ ఉంది. ఏమోషన్స్ ఉన్నాయి. సినిమాలు నాశనం కావడానికి ముఖ్యం కారణం ఏమంటే రచయితల మీద […]