కార్మిక రాజ్య భీమా సంస్థ (ఈఎస్ఐ)లో మందులు, వైద్య పరికరాల్లో వందల కోట్ల రూపాయల కుంభకోణం తెలంగాణాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనూ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కుంభకోణం వెనుక వాస్తవాలను బట్టబయలు చేసింది. దాదాపు 151 కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగినట్లు నిర్థారించింది. 2014 –19 మధ్య ఈ తంతు సాగినట్లు తేల్చింది. ఈ వ్యహారంలో అప్పట్లో రాష్ట్ర కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు […]
తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు బలమైన పునాదులున్న ఉత్తరాంధ్రలో ఇప్పుడు తలనొప్పిగా మారుతోంది. విజయనగరం జిల్లాలో ఆపార్టీ పునాదులు కూలిపోతున్నాయనే అభిప్రాయం కనిపిస్తోంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ పూర్తిగా నిస్తేజంలోకి మళ్లింది. నడిపించే నేత లేకపోవడంతో తీవ్రంగా తల్లడిల్లిపోతున్న పార్టీకి తాజా పరిణామాలు మరింత శిరోభారం అవుతున్నాయి. ఓ వైపు సీనియర్ నేతలు క్రియాశీలకంగా లేకపోవడం, మరోవైపు రాజధాని ఉద్యమం కారణంగా పూర్తిగా కార్నర్ కావడంతో తెలుగుదేశం పార్టీకి ఎటూ పాలుపోని పరిస్థితి […]
మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో షాక్ కు గురైన తెలుగుదేశం మెల్లగా పరిస్థితులు అర్థం చేసుకుంటోంది. మొత్తం 175 సీట్లలో కేవలం 23 స్థానాలతో చతికిలపడిన తెలుగు దేశం ఐపొడు మళ్ళీ పట్టుకోసం పావులు కదుపుతోంది. అమరావతి రాజధాని తరలింపు విషయంలో ధర్నాలు, ఉద్యమాలు చేసినా చంద్రబాబు , ఇతర నాయకులు మరో తప్పిదాన్ని చేేసినట్లయింది. అటు రాయల సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ఎదుగుదలను అడ్డుకుంటున్నారని,కేవలం చంద్రబాబు ఆయన బినామీల ఆస్తులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న […]
రాజకీయ ప్రయాణంలో తెలగుదేశం పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందా..? 2019 ఎన్నికల ఫలితాలు.. ఆ పార్టీని మరింతగా దిగజారుస్తున్నాయా..? టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న విధానాలే ఆ పార్టీకి సంకటంగా మారాయా..? ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారా..? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు 17 మంది తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నిన్న ఆదివారం విలేకర్ల […]
అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా తనకు మైక్ ఇవ్వడంలేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రావడంతో కోటం రెడ్డి తన ఆవేదనను నిండు సభలో వెల్లగక్కారు. కోటం రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే… ‘‘ గతంలో ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉండేవాడిని, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోరాడి మైక్ సాధించేవాడిని. మైక్ ఇవ్వకపోతే […]
రెండు రోజుల విరామం తర్వాత ఈరోజు ఉదయం ప్రారంభమైన శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో, తెలుగుదేశం పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడుగారు పాలకొల్లు పట్టణంలో నిర్మాణంలో టిట్కోహౌసింగ్ స్కీంపై ప్రశ్న లేవనెత్తగా, దీనిపై స్పందించిన మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిస్తున్న తరుణంలో ఇరువురి మధ్య రివర్స్ టెండరింగ్, గత ప్రభుత్వం L &T కంపెనీకి ఎక్సెస్ టెండర్ ఇచ్చిందని వాడివేడి చర్చ జరుగుతుండగా, మధ్యలో అచ్చంనాయుడు కల్పించుకొని రాజకీయ విమర్శలు చేయడంతో సభలో వాతావరణం ఒక్కసారిగా […]