బ్రతికినన్నాళ్ళు నలుగురితో మంచిగా ఉంటూ చేతనైన సాయం చేస్తూ ఉంటే మరణం తర్వాత కూడా జీవితం ఉంటుందని చాటిన గొప్ప సినిమా ఆ నలుగురు. కామెడీ హీరోగానే ప్రేక్షకులకు దగ్గరైన రాజేంద్ర ప్రసాద్ లోని మరో ఎమోషన్ ని బయటికి తీసుకొచ్చిన అరుదైన చిత్రాల్లో ఇదీ ఒకటి. మెప్పించేలా చూపిస్తే ఎంత సందేశం ఉన్నా ఎంత సెంటిమెంట్ జొప్పించినా జనం ఆదరిస్తారని చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. పెళ్ళైన కొత్తలో దర్శకుడు మదన్ తన కెరీర్ […]