ఇప్పుడు అందరి దృష్టి జనవరి 20 వైపు మళ్లింది. ఆరోజు ఏపీ క్యాబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంది. మూడు రాజధానుల విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టత రాబోతోంది. అమరావతి ప్రాంతం విషయంలో ప్రభుత్వ వైఖరి వెల్లడికాబోతోంది. అసెంబ్లీలోనూ చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు శాసనమండలి నిర్వహించే యోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆరోజు పరిణామాలు ఎలా ఉంటాయన్నదానిపై ఆసక్తి రేగుతోంది. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మొదలయ్యింది. ఇప్పటికే […]
వికేంద్రీకరణ కోసం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా తిరుపతిలో వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి,వైసీపీ ఎంపీ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికారు.రాయలసీమ ప్రాంతం వాళ్ళయిన చంద్రబాబు 14 సంవత్సరాలు, కిరణ్ కుమార్ రెడ్డి మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని, చంద్రబాబు ఇక్కడ యూనివర్సిటీలోనే చదువుకున్నారని తెలిపారు. […]
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల గంట మోగింది. పండగ ముగిసిన మరుసటి రోజే అధికరికంగా ఎన్నికల నగారా మోగనుంది. పండగ రానే వచ్చింది. ఇక మూడు రోజుల్లో ఎన్నికల బరిలోకి అన్ని రాజకీయ పార్టీలు దిగాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒక ఎత్తయితే.. స్థానిక సంస్థలు మరో ఎత్తు. స్థానిక సంస్థల్లో గెలిచిన పార్టీకి క్షేత్రస్థాయిలో మరింత బలపడే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలతోపాటు స్థానిక నాయకులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. మునుపెన్నడూ […]