తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు టిఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తెలంగాణ నుుంచి రోజుకు వెయ్యి మందికి రూ. 300 దర్శన టికెట్లను జారీచేయనున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. 1000 మంది ప్రయాణికులకు శ్రీవారి దర్శన టికెట్లను అందించేందుకు టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకరించారన్నారు. ఈ దర్శన టికెట్లు పొందాలనుకునే ప్రయాణికులు.. తమ ప్రయాణానికి రెండ్రోజులు ముందు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్టు రిజర్వు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. […]