సాధారణంగా డ్యూయల్ రోల్ సినిమాల్లో హీరో వేసిన పాత్రల మధ్య రక్త సంబంధం ఉంటుంది. అలనాటి రాముడు భీముడుతో మొదలుపెట్టి జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ దాకా చూసుకుంటే ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నాగార్జున హలో బ్రదర్ చూసినా బాలకృష్ణ అపూర్వ సహోదరులు చూసుకున్నా ఇదే తీరు. అయితే మినహాయింపులుగా నిలిచినవి లేకపోలేదు. కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు, చిరంజీవి రౌడీ అల్లుడు కొన్ని ఉదాహరణలు. అధిక శాతం మాత్రం బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ తో రూపొందినవే. […]