పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీర్ భూమ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత హత్యకు ప్రతీకారంగా అతని వర్గీయులు తీవ్ర హింస, గృహదాహనాలకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో పదిమంది సజీవ దహనమయ్యారు. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత అలుముకుంది. అగ్నిమాపక దళాలు, పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. హత్యకు ప్రతీకారంగా దాడులు బీర్ భూమ్ […]