హను రాఘవపూడి. పరిచయం పెద్దగా అక్కర్లేని పేరు. అందాల రాక్షసితో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమా కమర్షియల్ గా గొప్ప విజయం సాధించకపోయినా టేకింగ్ పరంగా ప్రశంశలు గట్టిగానే దక్కించుకున్నాడు. ఈ మధ్య కన్నడలో దియా అనే ఓ సూపర్ హిట్ మూవీ వస్తే దాన్ని అందాల రాక్షసితో పోల్చిన వాళ్ళు అనేకం. అంతలా దాని ప్రభావం ఉండిపోయింది. రెండో సినిమాకు కాస్త రూటు మార్చి నానితో చేసిన కృష్ణగాడి వీరప్రేమ గాధ మంచి ఫలితాన్నే ఇచ్చింది. […]