iDreamPost
android-app
ios-app

టాలెంటెడ్ డైరెక్టర్ కి ఏజ్ బార్ హీరో ?

  • Published Mar 28, 2020 | 5:02 AM Updated Updated Mar 28, 2020 | 5:02 AM
  • Published Mar 28, 2020 | 5:02 AMUpdated Mar 28, 2020 | 5:02 AM
టాలెంటెడ్ డైరెక్టర్ కి ఏజ్ బార్ హీరో ?

హను రాఘవపూడి. పరిచయం పెద్దగా అక్కర్లేని పేరు. అందాల రాక్షసితో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమా కమర్షియల్ గా గొప్ప విజయం సాధించకపోయినా టేకింగ్ పరంగా ప్రశంశలు గట్టిగానే దక్కించుకున్నాడు. ఈ మధ్య కన్నడలో దియా అనే ఓ సూపర్ హిట్ మూవీ వస్తే దాన్ని అందాల రాక్షసితో పోల్చిన వాళ్ళు అనేకం. అంతలా దాని ప్రభావం ఉండిపోయింది. రెండో సినిమాకు కాస్త రూటు మార్చి నానితో చేసిన కృష్ణగాడి వీరప్రేమ గాధ మంచి ఫలితాన్నే ఇచ్చింది. వసూళ్లూ ఇచ్చింది.

కానీ నితిన్ తో చేసిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లై మాత్రం మిస్ ఫైర్ అయ్యింది. ఆ తర్వాత శర్వానంద్-సాయి పల్లవి క్రేజీ కాంబోలో చేసిన పడి పడి లేచే మనసు దారుణమైన రిజల్ట్ హను మీద తీవ్ర ప్రభావం చూపించింది. ఊహించని విధంగా ఘోరంగా ఫ్లాప్ కావడంతో శర్వా సైతం కొంత కాలం డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. ఇటీవలే హనుకు ఓ పెద్ద బ్యానర్ లో ప్రాజెక్ట్ ఓకే అయ్యిందనే టాక్ వచ్చింది కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. తాజా అప్ డేట్ ప్రకారం హను రాఘవపూడి బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ తో కథ ఓకే చేయించుకున్నట్టు తెలిసింది. కళ్ళు కనిపించని ఓ పోలీస్ ఆఫీసర్ స్టోరీని ఆసక్తికరంగా చెప్పడంతో సన్నీ ఇంప్రెస్ అయ్యాడట.

నిజానికి సన్నీ డియోల్ ఏ మాత్రం ఫామ్ లో లేడు. హిట్టు కొట్టి చాలా ఏళ్ళు దాటింది. తన సమకాలీకులు ఇంకా సినిమాలు చేస్తున్నప్పటికీ సన్నీ మాత్రం దాదాపు మేకప్ కి దూరంగా ఉన్నాడు. ఇలాంటి సమయంతో ఇతనితో సినిమా చేయడం అంటే హనుకి సాహసమే. అయితే టాలీవుడ్ లో ప్రాజెక్ట్ ఓకే కావడంలో జాప్యం జరుగుతుండటంతో బాలీవుడ్ లో ఓ ట్రయిల్ వేద్దామని ఆలోచనలో హను ఉన్నట్టు కనిపిస్తోంది. సక్సెస్ ని మాత్రమే కొలమానంగా తీసుకునే పరిశ్రమలో ముందు ఎక్కడో ఒక చోట ప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం. ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి, సందీప్ రెడ్డి వంగా హిందీ బాట పట్టారు. మరి హను కూడా అదే దారిలో ఉన్నాడా లేదా ఇంకొద్ది రోజుల్లో తేలిపోతుంది

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss