దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) కట్టడిలో కేంద్రప్రభుత్వ వైఫల్యాలపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు నేడు భేటీ కానున్నాయి. వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో దాదాపు 20 పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షత వహించనున్న ఈ సమావేశాన్ని ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ సమన్వయం చేస్తున్నారు. మార్చి 24న దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఈ రకమైన సమావేశానికి సోనియాగాంధీ అధ్యక్షత వహించడం ఇదే […]
నరేంద్రమోడీః చప్పట్లు కొట్టి కరోనాని శబ్దంతో భయపెట్టాడు. తర్వాత దీపం వెలిగించి కాంతితో భయపెట్టాడు. తర్వాత రకరకాల వేషాలతో గట్టిగా అరిచి కరోనాని భయపెట్టమంటాడు. మనవాళ్లు గుంపులు గుంపులుగా ఆ పని చేస్తారు. వున్న వాళ్లు లేని వాళ్లకి కరోనాని అంటిస్తారు. అమిత్‌షాః హోంమినిస్టర్ కాబట్టి ఇంటికే పరిమితమయ్యారు. సోనియాగాంధీః కాంగ్రెస్ పార్టీని ఐసొలేషన్‌లోనూ, వెంటిలేటర్ మీద వుంచే ప్రయత్నాల్లో వున్నారు. చంద్రబాబుః మాటలతో కోటలు దాటిస్తున్నాడు. జగన్‌కి ఉచిత సలహాలు ఇస్తున్నాడు. తాను అధికారంలో ఉంటే […]