తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా ఆగిపోయిన సినిమా షూటింగ్లు ప్రారంభం కానున్నాయి. మళ్లీ గతంలోలా సినిమా, సీరియల్స్ షూటింగ్లకు దశలవారీ అనుమతులు రానున్నాయి. శుక్రవారం టాలీవుడ్ సినీ ప్రముఖులతో తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్ రావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, […]