దేశంలో వివిధ కోర్టుల్లో కొంత మంది న్యాయమూర్తులు తీసుకుంటున్న నిర్ణయాలు వల్లనే ఆరోపణలు వస్తున్నాయని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ పట్ల అసహనం పెరుగుతున్నదనీ, ఇది సామాజిక మాధ్యమాల ద్వారా అధికంగా ఉందని అన్నారు. పలువురు జడ్జిలు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి వారిపై ఆరోపణలు వస్తున్నాయనీ, ఈ విమర్శలు కొంత పరిమితిని దాటితే అది న్యాయ వ్యవస్థకు నష్టం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ”విమర్శలు కూడా సమాచారం […]