ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కరోనా రహిత జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం నిలిచాయి. అయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మూడు కేసులు వెలుగు చూడడంతో ఆ జిల్లాపై కూడా కరోనా పంజా విసిరినట్లయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు అప్రమత్తమైంది. ఆదిలోనే వైరస్ను అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా కట్టడికి శ్రీకాకుళం జిల్లాకు సమర్ధుడైన అధికారిని నియమించాలని […]
మూడు పాజిటివ్ కేసులు నమోదు ఇన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కరాల నృత్యం చేస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న కరోనా ఇంకా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోకి రాలేదు అనుకున్నా ఇప్పుడు ఇక్కడా దాని ఉనికి బయటపడింది. శనివారం శ్రీకాకుళంలో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్త, వారి కుమార్తెకు కరోనా సోకినట్లు రిపోర్ట్ రావడంతో జిల్లా వాసుల్లో కలవరం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. శనివారం కొత్తగా 61 కేసులు […]
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61 పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నిర్దారణ అయ్యాయి. దాంతో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి. కొత్తగా నమోదయిన కేసులతో కలిపి మొత్తం 1016 కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది. శ్రీకాకుళంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ […]
శ్రీకాకుళం జిల్లాలోని తెలుగుదేశంపార్టీ నేతల్లో చాలామంది అసలు అడ్రస్సే కనబడటం లేదట. ఎప్పుడైతే కరోనా వైరస్ మొదలైందో అప్పటి నుండే చాలామంది నేతలు పార్టీ క్యాడర్ కు కానీ జనాలకు కానీ అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గాలి స్పష్టంగా కనబడినా సిక్కోలు జిల్లాలో మాత్రం ఓ ఎంపి+రెండు ఎంఎల్ఏ సీట్లను టిడిపి గెలుచుకుందంటే అర్ధమేంటి ? జిల్లాలోని పసుపు పార్టీ మీద జనాల్లో అక్కడక్కడ ఇంకా అభిమానం […]