దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు మద్యం. దాదాపుగా 50 రోజులుగా లాక్డౌన్ వల్ల దేశంలోని మద్యం షాపులన్నీ మూతవేసి ఉన్నాయి. మొన్న కేంద్రం మద్యం అమ్మకాలు చేసుకునేందుకు సడలింపులు ఇచ్చింది. కేంద్ర మార్గదర్శకాలకు లోబడి, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చేసినట్లే ఏపీలోనూ మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. ఇందులోనూ విపక్షాలు విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెడుతున్నాయి. మద్యంతో ఖజానా నింపుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కొందరు విపక్ష నాయకులు అంటుంటే.. దోపిడీ చేస్తోందని కొందరు, మంచి బ్రాండ్లు […]