హంగు, ఆర్భాటాల్లేవ్. ఉన్నదల్లా ప్రజలకు మంచి చేయడమే. ఇదీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీరు. లాక్డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు బంద్ అయ్యాయి. ప్రజలకు ఇళ్లలకే పరిమితమయ్యారు. ఏ రోజుకారోజు పని చేసుకుని బతికే నిస్సహాయులు ఆకలితో అలమటించకుండా, పొట్టచేతపట్టుకుని వలస వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకుండా సీఎం నవీన్ పట్నాయక్ ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఉండేందుకు, తినేందుకు వారు ఇబ్బంది పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వీధిజీవాలు (కుక్కలు, పిల్లులు) ఆకలి తెలిసిన […]