కరోనా వైరస్ నుండి కాపాడుకోవడానికి మనకున్న అతి పెద్ద ఆయుధం చేతులను తరచూ శుభ్రపరచుకోవడం అని ఇప్పుడు మీకందరికీ తెలుసు. ఇప్పుడు ప్రపంచంలోని కోట్లాది మంది రోజూ సబ్బు, హ్యాండ్ వాష్, సానిటైజర్లతో గడియగడియకు చేతులు శుభ్రపరచుకోవడం సర్వసాధారణ దృశ్యం. అయితే సుమారు నూటా డెబ్భై ఏళ్ల క్రితం హంగేరికి చెందిన డాక్టర్ ఇగ్నాజ్ సెమ్మెల్వీస్ తొలిసారిగా ఆరోగ్య రక్షణ కోసం చేతులు శుభ్రపరచుకోవాలి అని చెప్పినప్పుడు ఆయన తోటి డాక్టర్లే అవహేళన చేశారు. అప్పటి వైద్యులంతా […]