తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌పై అధికార పార్టీకి చెందిన డోర్నకల్ శాసన సభ్యుడు డిఎస్.రెడ్యా నాయక్ విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశం నిర్వహించి ఏకంగా మంత్రిని టార్గెట్ చేశాడు. మంత్రి సత్యవతి రాథోడ్‌పై ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తొలిసారిగా రచ్చకెక్కడంతో దీంతో మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డోర్నకల్ నియోజకవర్గంలో ప్రత్యర్థులైన రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్‌లు.. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్క గూటికి చేరుకున్నారు. ఆ తర్వాత […]