(24 ఏళ్ళ క్రితం వచ్చిన మ్యూజికల్ లవ్ బ్లాక్ బస్టర్ ‘ప్రేమ దేశం’ గురించి ఆ సమయంలో పదో తరగతి పూర్తి చేసుకున్న ఓ సినిమా అభిమాని జ్ఞాపక తరంగం) “రేయ్ ప్లీజ్ రా. ఎలాగైనా ఇప్పించరా. నీకు దండం పెడతా.నువ్వేం అడిగినా చేస్తాను. ఇది అయ్యాక మళ్ళీ నిన్నేమి అడగను ప్రామిస్” అప్పటికది పదో పన్నెండోసారో మా వాసుగాడిని బతిమాలుకోవడం. వారం నుంచి నిద్రపట్టడం లేదు. ఎలాగైనా చూసి తీరాలి. వచ్చి రెండు వారాలు దాటేసింది. […]