అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాలు పరిమితికి మించి ఏప్రిల్ మొదటి వారంలో కూడా నీటిని విడుదల చేస్తుండడంతో కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉన్న నీటి మట్టాలపై కృష్ణా బోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టానికి దిగువకు నీటి మట్టాలు పడిపోగా.. నీటి వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. ఈ నెపధ్యంలో రానున్న వేసవిలొ తాగు నీటి అవసరాలకు కేవలం సాగర్పైనే ఆధారపడాల్సి ఉంటుందని, అక్కడ […]