ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశం జరుగుతున్న వేళ ప్రతిపక్ష నేత, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమంపై అత్యంత ముఖ్యమైన బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సమయంలో చంద్రబాబు తన పార్టీ సభ్యులతో సభ నుంచి వెళ్లిపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించిన వెంటనే చంద్రబాబు, టీడీపీ సభ్యులు సభ నుంచి […]
అందరూ ఊహించినట్లుగానే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యులు వ్యవహరించారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తన ప్రసంగాన్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించగానే టీడీపీ సభ్యులు ఉభయ సభల్లో నిరసనలకు దిగారు. నల్లచొక్కాలు ధరించి సభలకు హాజరైన టీడీపీ సభ్యులు తమ తమ స్థానాల్లో నిలబడి అక్రమ అరెస్ట్లు ఆపాలని.. ప్రజా స్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట అంటూ ఆసాంతం […]
ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చారు. ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడును పరామర్శించేందుకు చంద్రబాబు వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వడం సాధ్యం కాదంటూ అధికారులు చెప్పారు. ఈ క్రమంలో జీజీహెచ్ సూపరిండెంటెండ్తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు అచ్చెం నాయుడు ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆస్పత్రి ముందు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఎప్పటిలాగే ప్రభుత్వంపై విమర్శలు […]
గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల అరెస్టులు ఆంధ్రప్రదేశ్ లో కొన సాగుతున్నాయి. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు హస్తం ఉన్నట్లు ఆధారాలు దొరకడంతో.. ఆయనను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన జెసి ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి లు మరో కేసులో అరెస్ట్ అయ్యారు. పలు అక్రమాల భాగస్వామ్యంలో టీడీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు ను కూడా త్వరలో అరెస్ట్ […]
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మరోసారి జైలుపాలయ్యారు. నిన్న టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టను నిరసిస్తూ చింతమనేని ప్రభాకర్ ధర్నాకు దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. అనుమతి లేకుండా ధర్నా చేసిన చింతమనేని అరెస్ట్ చేసిన పోలీసులు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న సాయంత్రం నుంచి స్టేషన్లోనే ఉంచారు. ఈ రోజు ఉదయం కోర్టులు తెరుకున్న వెంటనే చింతమనేని న్యాయస్థానంలో హజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల […]
టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ నేతలు మేథావిగా భావించే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అచ్చెం నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలపై అరెస్ట్పై స్పందించారు. తన భాష ప్రావిణ్యాన్ని ఉపయోగించి ప్రాసలతో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని చెప్పుకొచ్చారు. అచ్చెం నాయుడు అరెస్ట్ ఒక తప్పు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ మరో తప్పు, జేసీ అస్మిత్ రెడ్డి అరెస్ట్ […]
ఏపీలో పోలీసులు మరో కీలక నేతను అదుపులోకి తీసుకున్నారు. ఈసారి అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన తో పాటు మొన్నటి ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీకి టీడీపీ తరుపున బరిలో దిగిన జేసీ అస్మిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన వారిద్దరినీ అనంతపురం తరలిస్తున్నారు. జేసీ ట్రావెల్స్ యజమానులుగా జేసీ బ్రదర్స్ పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన విషయంలో వారిపై […]
నేరుగా టీడీపీ అధినేతనే ఐటీ దాడులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో లభించిన ఆధారాలతో అలజడి రేగింది. ఆ తర్వాత అది కొంత సర్థుమణిగినట్టు కనిపిస్తున్న సమయంలో సిట్ అంటూ ఏపీ ప్రభుత్వం సీన్ లోకి వచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా అడుగులు వేసేందుకు సన్నద్దమవుతున్న సమయంలోనే సీబీఐ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ క్యాబినెట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అందులోనూ హెరిటేజ్ నుంచి కొనుగోళ్లతో పాటుగా ఫైబర్ నెట్ బండారం […]
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించే పరిణామాలు మరిన్ని ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీ శాసనసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడిని అవినీతి కేసులో అరెస్ట్ చేయడం పట్ల పలు వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం ముఖ్యంగా బీసీ కార్డ్ ప్రయోగించే ఫలితం చేయడం చాలామందిని విస్మయానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఈఎస్ఐ కుంభకోణం- అచ్చెన్న అరెస్ట్ పై సీపీఎం సూటిగా స్పందించింది. కార్మికుల సంక్షేమం కోసం, వారి కుటుంబీకుల ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను […]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేశ్ గత వారం ఓ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలామంది ఇంకా మరచిపోలేదు. తమ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేసిన జగన్ ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారన్నది చినబాబు ఉవాచ. ఆయన మాట చెప్పిన వారం గడవకముందే జగన్ ప్రభుత్వం పావులు కదిపింది. ఈఎస్ఐ కుంభకోణంలో చట్ట ప్రకారం చర్యలకు పూనుకుంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా చంద్రబాబు సన్నిహితుడు అచ్చెన్నాయుడి మెడకు […]