ఒకప్పుడు ఐశ్వర్యవంతులు అన్న పదానికి పర్యాయపదంగా టాటాలు, బిర్లాలు అనేవారు. కాలం గడిచేకొద్థీ కొత్త వ్యాపారాలు వచ్చాయి: పవర్, మీడియా, సాఫ్టువేర్ లాంటివి. కొత్త వ్యాపార కుటుంబాలు, గ్రూపులు వచ్చి ఐశ్వర్యవంతుల జాబితాలో కొందరు టాటా, బిర్లాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచారు. అయితే ఈ నూతన ఐశ్వర్యవంతులకీ టాటాలకీ ఉన్న ముఖ్యమైన తేడా కోర్ వాల్యూస్. సామాజిక బాధ్యత, దాతృత్వం అనేవి అందులో ముఖ్యమైనవి. 1870లో టాటా గ్రూప్ ఫౌండర్ జెంషెట్జీ టాటా 21 వేల […]