సిద్దార్థ్ హీరోగా భాస్కర్ దర్శకత్వంలో 2006లో వచ్చిన బొమ్మరిల్లు అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ముఖ్యంగా ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ కలివిడిగా ఉండే హీరోయిన్ హాసిని పాత్రలో జెనీలియా నటన అప్పట్లో యూత్ కి మాములుగా ఎక్కలేదు. అంతేనా ఇంకేం లేవా లాంటి డైలాగులు ఎంత పాపులరయ్యాయో వేరే చెప్పనక్కర్లేదు. అంతకు ముందు బాయ్స్, సత్యం, సై లాంటి హిట్లు ఉన్నప్పటికీ ఈ సినిమా తెచ్చిన గుర్తింపు వేరే. అక్కడితోనే తను ఇంకో లెవెల్ కు వెళ్లిపోయింది. […]