ఇసుక, మద్యం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేలా సీఎం జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) సత్తా చాటుతోంది. యువ ఐపీఎస్లు కదన రంగంలో దూసుకుపోతున్నారు. మద్యానికి సంబంధించి ఎక్కడ అక్రమాలు కనిపించినా కొరడా ఘుళిపిస్తున్నారు. నాలుగు రోజుల కిందటే బాధ్యతలు చేపట్టిన యువ ఐపీఎస్లు. మొదటి రోజు నుంచే తమ కార్యకలాపాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో మద్య నిషేధం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. […]
డబ్బు, అధికారాలు మనిషి గుణగణాలను పరీక్షిస్తాయి. అందుకే డబ్బు, అధికారం ఇచ్చి చూస్తే ఎవరేంటో తెలుస్తుందంటారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకుల తీరు ఇప్పుడిలాగే ఉంది. అధికారంలో ఉండగా ఇచ్చిన హామీలనే త్రుణప్రాయంగా విస్మరించిన టీడీపీ…ప్రతిపక్షంలోకి రాగానే కుటుంబానికి రూ.5000, రూ.7500 సాయం అందించాలంటూ డిమాండ్ చేస్తోంది. దీంతో ఇదే కదా అసలైన రాజకీయం అంటూ ప్రజలు చెవులుకొరుక్కుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ప్రభుత్వ సొమ్మును సొంత సొమ్ముగా భావిస్తుంటారు. […]