రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సంక్షేమ పాలన అందించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచారు. అన్ని వ్యవస్థల బలోపేతానికి కృషి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డారు. అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చిన వాటిని పక్క పెట్టి ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగారు. అవినీతి పాలనకు చరమగీతం పాడారు. సామాజిక న్యాయానికి బాటలు వేశారు. ప్రాథమిక రంగాలైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టారు. పారిశ్రామిక, […]
ఏడాది జగన్మోహన్ రెడ్డి పరిపాలన భేష్షుగ్గా ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పటం గమనార్హం. కేంద్ర నాయకులేమో జగన్ పరిపాలనను అభినందిస్తుంటే రాష్ట్ర నాయకులు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. జగన్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపుగా వెళుతోందంటూ చెప్పాడు. ఇదే సమయంలో జగన్ పై బురద చల్లటమే టార్గెట్ గా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ యాగీ చేస్తున్న విషయం […]
విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తోందంటూ చంద్రబాబునాయుడుతో సహా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ ఉత్త డొల్లే అని తేలిపోయింది. తాజాగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించిన లెక్కల కారణంగా విద్యుత్ బిల్లుల ఆరోపణల్లో డొల్లతనం బయటపడింది. లాక్ డౌన్ కారణంగా కుటుంబసభ్యులందరూ ఇంట్లోనే ఉన్న కారణంగా విద్యుత్ వినియోగం పెరగటంతో బిల్లులు పెరిగాయని అధికారులు చెప్పినా వినకుండా ప్రతిపక్షాలు కావాలనే గోల చేస్తున్నాయి. ఇంతకాలం నోటిమాటగా చెప్పిన వివరాలనే అధికారులు ఇపుడు లెక్కలతో సహ వివరించారు. ఉన్నతాధికారులు ఇచ్చిన […]
ఏపీ సర్కారు కొత్త పద్ధతి అనుసరిస్తోంది. ఆందోళన చెందుతున్న వారికి నేరుగా అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగా నేరుగా ప్రతిపక్ష నేతల ఇళ్లకు కూడా అధికారులను పంపించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా వివిధ సమస్యలపై వారిలో ఉన్న అభిప్రాయాలకు తగిన సమాధానం చెప్పడం ద్వారా శాంతింపజేసే విధానం అనుసరిస్తోంది. అందులో భాగంగా తాజాగా విద్యుత్ బిల్లులకు సబంధించి వివిధ పార్టీల నేతల వాదనలకు తగిన సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేసింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు […]
ఏ విషయంలో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేసింది పెద్దగా లేదు. రెండు పార్టీలో పొత్తులు పెట్టుకున్నట్లు చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం కూడా రెండు పార్టీలు కలిసి చేసిందే లేదు. పైగా ఏ పార్టీకాపార్టీనే కార్యక్రమాలను విడివిడిగా చేసుకుంటున్నాయి. ఇక తాజాగా కమలనాధుల వ్యవహారం చూస్తుంటే జనసేనతో దూరమైపోయినట్లేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి […]
‘అధిష్టానం ఎవరికి ఏమి చెప్పిందో తెలీదుకానీ వివాదం సద్దుమణిగింది’ .. ఇది తాజాగా కన్నా లక్ష్మీనారాయణ-విజయసాయిరెడ్డి మధ్య జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణల గురించి ఎల్లోమీడియాలో వచ్చిన ఓ వ్యాఖ్య. ప్రతి ఆదివారం ఎల్లోమీడియాలో వచ్చే కొత్తపలుకులో మీడియా యాజమాని వేమూరి రాధాకృష్ణ బిజెపి-విజయసాయిరెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి సవివరంగా ప్రస్తావించాడు. జరిగిన సంఘటనల ఆధారంగా చూస్తే బిజెపి అదిష్టానానికి పార్టీ నేతలకన్నా తానే దగ్గరనేట్లుగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నాడంటూ తెగ బాధపడిపోయాడు. సరే వేమూరి బాధగురించి […]
కన్నా..కాణిపాకం ఎప్పుడొస్తావ్.. అంటూ ఓవైపు విజయసాయిరెడ్డి కవ్విస్తున్నారు. రెండో వైపు నిరాధారంగా, అధిష్టానం అనుమతి లేని విమర్శలు ఇక చాలించాలని కేంద్రం నుంచి కట్టడి చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కుతకుతలాడిపోతున్నట్టు కనిపిస్తోంది. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న కన్నాకి ఇది కష్టకాలంగా భావిస్తున్నారు. టీడీపీ నేతలను, సుజనా చౌదరి వంటి వారిని చూసి చెలరేగిపోతే చివరకు సైలెంట్ కావాల్సిన పరిస్థితి వస్తుందనే అభిప్రాయం బలపడుతోంది. బీజేపీ అధిష్టానం తాజా […]
ఎందుకంటే వైసిపి-బిజెపి మధ్య చెలిమి చెడిందా ? అని క్వశ్చన్ మార్కు పెట్టి అచ్చేసిన కథనంలో చివరకు చెలిమి చెడిండని తీర్మానించేసింది. చెలిమి చెడింది కాబట్టే వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరుకుందని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏరోజు కూడా వైసిపి, బిజెపి మధ్య మిత్రత్వంలేదు. బిజెపి జాతీయపార్టీ అన్న విషయం బహుశా ఎల్లోమీడియా మరచిపోయినట్లుంది. బిజెపితో పొత్తు […]
ఏపీ బీజేపీ వ్యవహారాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కమల దళంలో కొందరి తీరుతో చాలాకాలంగా ఓపికగా ఉన్న అధికార వైఎస్సార్సీపీ ఒక్కసారిగా విరుచుకుపడడం విశేషంగా మారింది. అందులోనూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ మీద గురిపెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. స్వయంగా విజయసాయిరెడ్డి లీడ్ తీసుకుని ప్రారంభించిన దాడితో రాజకీయ పరిణామాల మీద పెద్ద చర్చ జరిగింది. చివరకు తాజాగా బీజేపీ అధిష్టానం జోక్యంతో వ్యవహారం సర్థుమణుగుతున్నట్టే కనిపిస్తోంది. నాలుగైదు రోజులుగా సాగుతున్న రాజకీయ […]
రాజకీయ జీవితంలో ఒక్కొక్క ఏడాది వెనక్కి వెళ్లి పోతోంది. అనుభవం వచ్చే కొద్దీ నాయకుడి ప్రతి పనిలో, మాటలో పరిపక్వత కనిపించాలి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు ఆది నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉంది. ఏదైనా ఒక అంశంలో ప్రారంభాన్ని వదిలేసి మధ్యలో వచ్చిన వారిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం మొదటి నుంచి చూస్తున్నాం. ఏదైనా ఒక అంశంపై పూర్వాపరాలు గురించి చర్చించకుండా వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని పవన్ […]