క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన టీ-20 లీగ్ టోర్నీ ఐపీఎల్-2020 గత మార్చి 29 న ప్రారంభం కావలసి ఉంది.అయితే దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌ని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.కాగా ఇప్పటివరకు దిగ్విజయంగా ముగిసిన 12 ఐపీఎల్ ఎడిషన్లలో భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ప్లేయర్లు కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో అద్భుత ప్రతిభ కనపరిచారు. ఇక ఐపీఎల్-2008 నుండి ఐపీఎల్-2013 వరకు మొత్తం ఆరు సీజన్లలో […]
టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే ఐపీఎల్లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.2008లో అండర్ -19 ప్రపంచ కప్ గెలిచిన తరువాత, ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఐపీఎల్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌కు ముందు కర్ణాటక కుర్రవాడు మనీష్ పాండేని ముంబై ఇండియన్స్ ఎంపిక చేసుకుంది. ఐపీఎల్-2008లో రెండు మ్యాచ్‌లు ఆడి కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు.అయితే ఐపీఎల్ -2009 సీజన్లో తన స్వరాష్ట్ర ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మనీష్ పాండే […]
దేశంలో విధించిన లాక్డౌన్ కారణంగా బీసీసీఐ ఐపీఎల్ 13వ సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. అయితే ఐపీఎల్ ఫ్రాంఛైజీ జట్ల యాజమాన్యాలు అభిమానులను ఉల్లాస పరచటానికి తమ జట్టు సభ్యులతో సోషల్ మీడియా వేదికగా ఆన్లైన్ సెషన్ నిర్వహిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ఆన్లైన్ సెషన్లో పాల్గొన్న భారత వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. సుదీర్ఘ టెస్ట్ ఫార్మేట్ ఆడాలనే కోరికతో తన బ్యాటింగ్ టెక్నిక్ […]
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా భారత సీనియర్ ఆల్‌రౌండర్ సురేష్ రైనా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడే రైనా మొత్తం 193 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 164 మ్యాచ్‌లు సీఎస్కే తరఫున ఆడగా,మిగిలిన మ్యాచ్‌లు ప్రస్తుతం ఐపీఎల్ లో ఉనికిలో లేని కొచ్చి టస్కర్స్ తరఫున ఆడాడు. ఫిక్సింగ్ ఆరోపణలపై చెన్నై సూపర్ కింగ్స్ రెండు సంవత్సరాలు నిషేదానికి గురైన సమయంలో కొచ్చి టస్కర్స్ జట్టుకు రైనా నాయకత్వం కూడా […]
అంతర్జాతీయ క్రికెట్లో పొట్టి ఫార్మేట్ టీ-20 ప్రవేశంతో ఇక అందులో బ్యాట్స్మన్లదే హవా అని అందరూ విశ్లేషించారు. అందుకు తగ్గట్లుగానే టీ-20ల ప్రారంభంలో బ్యాట్స్‌మెన్ బౌలర్లపై ఆధిక్యత ప్రదర్శించారు. పైగా తొలి ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టడం సాధ్యమేనని నిరూపించి ఆ విశ్లేషణలను నిజం చేశాడు. కానీ భారత్‌లో ప్రారంభమైన ఐపీఎల్-2008 తొలి సీజన్లో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ […]
ఐపీఎల్ పుణ్యమా అని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్,ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు బాగానే ఒంట పట్టించుకున్నట్లు ఉంది. తాజాగా ఒక పాపులర్ తెలుగు సినిమా పాటకు భార్యతో కలిసి వార్నర్ చేసిన టిక్‌టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.లాక్డౌన్ కాలంలో సరదాగా భార్య, కూతురులతో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం హ్యాబిట్‌గా మార్చుకున్నాడు. కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్,పూజా హెగ్డే నటించిన ‘అల…వైకుంఠపురములో’’ సినిమా పాటలు […]
ఐపీఎల్ ప్రారంభమై 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ 50 మంది జ్యూరీ సభ్యుల అభిప్రాయాల ఆధారంగా వివిధ కేటగిరీలో అత్యుత్తమ ఆటగాళ్లని ఎంపిక చేసింది.ఉత్తమ కెప్టెన్ల విభాగములో ఐపీఎల్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్లుగా మహేంద్రసింగ్ ధోనీ,రోహిత్ శర్మ సంయుక్తంగా ఎంపికయ్యారు.మిస్టర్ కూల్ ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లో ఆడిన 10 సీజన్లోనూ ప్లేఆఫ్ దశకు చేరుకొని మూడు సార్లు టోర్నీ ఛాంపియన్‌గా నిలిచింది.అలాగే రోహిత్ శర్మ సారథ్యంలో ముంబయి ఇండియన్స్ టోర్నీ […]
కరోనా రాక్షసి కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తూ మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా ప్రకటించింది.ఐపీఎల్ వాయిదాపై ఈరోజు ఉదయమే టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీల యాజమాన్యాలకి సమాచారం అందజేసింది. ఐపీఎల్-2020 వాయిదాపై టోర్నీ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్‌కి కూడా బీసీసీఐ సమాచారం ఇచ్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ […]
భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో అర్థ సెంచరీ లేదా సెంచరీ సాధించిన తర్వాత మైదానంలో బ్యాట్‌ని కత్తిలా తిప్పుతూ సంబరాలలో మునిగి తేలుతాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న డేవిడ్ వార్నర్ గత ఏడాది ఒక యాడ్ కోసం జడేజా లాగా బ్యాట్‌ని కత్తిలా తిప్పాడు.అయితే ఈ వీడియోను నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అంతే కాక ఆసీస్ ఓపెనర్ వార్నర్ “నేను కూడా జడ్డూలాగే బ్యాట్ తిప్పానా?” అని […]
ఐపీఎల్ 2020 సీజన్ మరొక సారి వాయిదా పడటం ఖాయమైంది.ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణపై సోమవారం స్పష్టతనిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు.ఐపీఎల్ 13వ సీజన్ నిర్వహణపై శనివారం ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు.ప్రపంచం మొత్తం లాక్డౌన్లో ఉండి ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయినప్పుడు క్రీడల భవిష్యత్ ఏముంటుందని ప్రశ్నించారు.నేటి విపత్కర పరిస్థితులలో ఐపీఎల్ నిర్వహించడం కష్టసాధ్యమని స్పష్టం చేశారు.సోమవారం నాడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ యాజమాన్యాలతో,బీసీసీఐ అధికారులతో చర్చించిన తర్వాత […]