Idream media
Idream media
దేశంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా బీసీసీఐ ఐపీఎల్ 13వ సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. అయితే ఐపీఎల్ ఫ్రాంఛైజీ జట్ల యాజమాన్యాలు అభిమానులను ఉల్లాస పరచటానికి తమ జట్టు సభ్యులతో సోషల్ మీడియా వేదికగా ఆన్‌లైన్ సెషన్ నిర్వహిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ నిర్వహించిన ఆన్‌లైన్ సెషన్‌లో పాల్గొన్న భారత వెటరన్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. సుదీర్ఘ టెస్ట్ ఫార్మేట్ ఆడాలనే కోరికతో తన బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవడం తన కొంప ముంచిందని తెలిపాడు. ముఖ్యంగా 25 ఏళ్ల వయసులో టెక్నిక్ మార్చుకోవడంతో తన బ్యాటింగ్‌లోని దూకుడుతనం కోల్పోయానని ఊతప్ప పేర్కొన్నాడు.
భారత వెటరన్ బ్యాట్స్‌మెన్ ఉతప్ప మాట్లాడుతూ,”అప్పటికే భారత టెస్టు జట్టులో స్థానం కోసం కలలు కన్నాను, సుదీర్ఘ ఫార్మాట్‌కు అవసరమైన డిఫెన్స్ టెక్నిక్‌ను పొందేందుకు ప్రవీణ్ ఆమ్రే ఆధ్వర్యంలో బ్యాటింగ్ శైలిని మార్చుకున్నాను.ఇంకా సాంకేతికపరంగా మరింత మెరుగైన బ్యాట్స్‌మెన్‌గా తయారై, గంటలకొద్దీ క్రీజును అంటి పెట్టుకొని టెస్ట్ క్రికెట్‌లో నిలకడగా రాణించాలనుకున్నాను. కానీ దీర్ఘకాలంలో ఈ మార్పు ఫలితం ఇవ్వలేదు. వాస్తవానికి నా బ్యాటింగ్ టెక్నిక్‌ను 21 ఏళ్ల వయసులో మార్చుకుని ఉంటే బాగుండేది. అయినప్పటికీ నా క్రికెట్ కెరీర్ పట్ల సంతోషంగానే ఉన్నాను. అలాగే భారత్ తరఫున ఎప్పుడూ ఆడే అవకాశం దక్కేనా బ్యాటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబర్చాటానికి ప్రయత్నిస్తాను”అని వ్యాఖ్యానించాడు.
2006 ఏప్రిల్ 15న ఇంగ్లాండ్ జట్టుపై వన్డేలలో ఆరంగేట్రం చేసిన కర్ణాటక బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్ప టీ-20 ప్రపంచకప్-2007 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. టీ-20 మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు కాగా, టీ-20 వరుసగా 40కి పైగా పరుగులు సాధించిన ప్రపంచ రికార్డును కూడా ఈ కర్ణాటక ఆటగాడి పేరు మీదే ఉంది. అతను ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హేడెన్ (8) రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 2014 ఐపిఎల్ సీజన్‌లో పదకొండు 40కి పైగా పరుగులు సాధించిన ఘనత కూడా రాబిన్ ఊతప్పదే.ఇక 13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఊతప్ప 46 వన్డేలు,13 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. చివరిసారిగా అతను 2015లో జింబాబ్వే పర్యటనలో భారత్ తరుపున మైదానంలో కనిపించాడు.